Home » లావణ్యపై దుష్ప్రచారం.. వరుణ్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

లావణ్యపై దుష్ప్రచారం.. వరుణ్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anji
Ad

మెగా హీరో వరుణ్ తేజ్ కొద్దిరోజుల క్రితం తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠిని పెద్దల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ జంట పెళ్లి చేసుకుని ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాకముందే వరుణ్ తేజ్ సినిమాల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ మట్కా సినిమా నిలిచిపోయిందని.. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బడ్జెట్ భారీగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సినిమా నిలిపివేశారని ప్రచారం జరిగింది. ఇంకేముంది దానికి వారి వివాహానికి ముడి పెడుతూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్ లలో వార్తలు వండి వడ్డించారు.

Advertisement

తన భార్య గురించి ఇలా మాట్లాడటం, బాగాలేదని అనుకున్నాడేమో తెలియదు.. కానీ  వరుణ్ తేజ్ వెంటనే ఈ సినిమా యూనిట్ తరఫున అధికారిక ప్రకటన అయితే ఇప్పించేశారు. పలాస ఫేమ్ దర్శకుడు కరణ్ కుమార్ తో కలిసి తన తొలి పాన్ ఇండియన్ చిత్రం మట్కా రెగ్యులర్ షూట్ ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. వైర ఎంటర్ టైన్ మెంట్స్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించనున్న ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఫ్రీ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ తో ఈ సినిమా టీమ్ బిజీగా ఉంది. 1958-1982 మధ్య జరిగే కథ కావడంతో 50,80 ల మధ్య వాతావరణాన్ని రీక్రియేట్ చేయడానికి భారీ సెట్ లు రూపొందించారని యావత్ దేశాన్ని కదిలించిన యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న ఈ కథ వైజాగ్ నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు.

Advertisement

హైదరాబాద్ లో ఓల్డ్ వైజాగ్ సిటీని తలపించే భారీ సెట్ ని నిర్మిస్తున్నారని, ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను ఉంటాయని తెలుస్తోంది. యాక్షన్ ని పర్యవేక్షిస్తారని, 24 ఏళ్ల స్పాన్ కలిగిన కథలో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన గెటప్ లలో కనిపించనున్నారని అంటున్నారు. వరుణ్ తేజ్ కు హైయ్యస్ట్ బడ్జెట్ ఎంటర్టైనర్ గా ఉండే ఈ సినిమా కోసం వరుణ్ పూర్తి మేక్ ఓవర్ అవుతున్నారని ఆయన సరసన నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ కీలక పాత్రల్లో కనిపిస్తారని అంటున్నారు. ఈ చిత్రానికి సౌత్ లో అత్యంత బిజీగా ఉన్న కంపోజర్ లలో ఒకరైన జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్. ఇక ఈ మట్కా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading