టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సర్కారు వారి పాట చిత్రం తెరకెక్కుతుండటంతో ఈ ఏడాది జనవరి 13న ఈ చిత్రం విడుదల కానున్నదని తొలుత ప్రకటన వెలువడింది. అయితే సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ మూవీ రేసులో ఉండడం సర్కారువారి పాట షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా ఏప్రిల్ 01నవ తేదీకి పోస్ట్ ఫోన్ అయింది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల తేదీ మార్చి 25న ఫిక్స్ చేయడంతో పాటు వేర్వేరు కారణాల వల్ల సర్కారు వారి పాట షూటింగ్ అనుకున్న విధంగా జరగకపోవడంతో ఈ సినిమా మే 12కు వాయిదా పడింది.
మేలో విడుదలైన మహేష్ బాబు సినిమాలో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయినట్టు టాక్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమా విషయంలో టెన్షన్ పడుతున్నారు. మహేష్‌బాబు హీరోగా తేజ డైరెక్షన్‌లో వచ్చిన నిజం సినిమా మే నెలలోనే విడుదల అయింది. మే 23, 2003లో నిజం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశ పరిచింది. మహేస్‌బాబు హీరోగా ఎస్.జే.సూర్య దర్శకత్వంలో వచ్చిన నాని సినిమా కూడా ప్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా 2004లో మే 14న విడుదల అయింది.
Advertisement
Advertisement
Also Read : ‘కమల్ హాసన్’ తో ‘గౌతమి’ విడిపోవడానికి అసలు కారణం ఇదేనట..!
అదేవిదంగా మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మోత్సవం కూడా మే నెలలోనే విడుదల అయింది. బ్రహ్మోత్సవం సినిమా సీరియల్‌ను తలపించేలా ఉందని నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. మే నెల 20వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది. మహేష్ నటించిన మహర్షి మాత్రం మే 09న విడుదలై సక్సెస్ సాధించింది. ఈ సక్సెస్ సెంటిమెంట్ వల్లనే సర్కారు వారి పాట మేకర్స్ ఈ సినిమాను మే లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో మే 12 వరకు వేచి చూడాలి.
Also Read : బాహుబలి థాలి ఎక్కడ..? ఈ థాలిలో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో తెలుసా..?