Home » గుండెలను పిండేయాలని ఫిక్స్ అయ్యారు.. 4 గంటల నిడివితో బేబీ ఓటీటీలో రిలీజ్

గుండెలను పిండేయాలని ఫిక్స్ అయ్యారు.. 4 గంటల నిడివితో బేబీ ఓటీటీలో రిలీజ్

by Bunty
Ad

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైనటువంటి బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేసింది. కలెక్షన్ల పరంగా ఈ సినిమా రికార్డు బద్దలు కొట్టింది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి సాయిరాజ్ దర్శకత్వం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే సంచనాలు క్రియేట్ చేసింది.

Advertisement

ఈ సినిమాకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే సంఘటనలను ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 20 రోజులు అయింది. త్వరలో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా విషయంపై టాలీవుడ్ వర్గాల్లో ఓ వార్త వైరల్ అవుతుంది. థియేటర్లలో మూడు గంటల నిడివితో విడుదలైన ఈ సినిమా ఓటీటీలో నాలుగు గంటల నిడివితో విడుదల కానుంది. దీనిని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నారు.

Advertisement

సినిమాలో లేని ఒక సాంగ్ తో పాటు కొన్ని సీన్లను కూడా చేర్చనున్నారు. అవి కూడా వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మధ్య సాగేటువంటి సీన్లు. వారిద్దరి మధ్య చాలా బోల్డ్ సీన్స్ ఉండడంతో వాటిని తొలగించారట. వీటిని ఇక ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలో చేర్చనున్నారట. అలాగే ఆనంద్ దేవరకొండ, అతని తల్లి మధ్య ఉండే ఎమోషనల్ సీన్లు ఓటిటి కోసం కలుపుతున్నారట. ఇక ఈ సినిమా ఓటీటీలో నాలుగు గంటల నిడివితో రావడానికి సిద్ధంగా ఉంది.

Visitors Are Also Reading