Home » క్రేజీ ఛాన్స్ కొట్టేసిన బేబీ బ్యూటీ…ఏకంగా డీజె టిల్లుతోనే…!

క్రేజీ ఛాన్స్ కొట్టేసిన బేబీ బ్యూటీ…ఏకంగా డీజె టిల్లుతోనే…!

by Bunty
Ad

 

 

సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. డీజే టిల్లు సినిమాతో సాలిడ్ హీట్ అందుకున్నాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ. తాను నటించిన మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం డీజె టిల్లు సినిమాకు సీక్వెల్ గా డిజె 2 టిల్లు సినిమాతో సిద్దు బిజీగా ఉన్నాడు. రాధిక శెట్టి హీరోయిన్గా నటించిన స్థానంలో ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించబోతోంది.

Advertisement

Advertisement

ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబర్ 6న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా అనంతరం వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా మారనున్నాడు సిద్ధూ. తాను నటించే మరో సినిమాలో బేబీ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టిన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించనుందని సమాచారం. బేబీ సినిమాతో ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ కేక్ గా మారింది.

ఇక ఈ అమ్మడుకు వరుస సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఈ అమ్మడు కోసం గీత ఆర్ట్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు డేట్స్ ని తీసుకున్నారట. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఈ అమ్మడు ఛాన్స్ కొట్టేసింది. ఇక తాజాగా ఈ అమ్మడు హీరో సిద్దు పక్కన జతకట్టనుందని సమాచారం అందుతోంది.

Visitors Are Also Reading