Home » బాబర్ బలుపు మాటలు…రారా…. నా రూమ్ కి వచ్చి సెల్ఫీ తీసుకో!

బాబర్ బలుపు మాటలు…రారా…. నా రూమ్ కి వచ్చి సెల్ఫీ తీసుకో!

by Bunty
Ad

 

 

పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజమ్ ఎంతటి విధ్వంసకర ఆటగాడో అందరికీ తెలుసు. కాస్త కుదురుకున్నాడు అంటే ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తిస్తాడు. మైదానంలో చాలా కూల్ గా, కామ్ గా ఉండే బాబర్ ఫ్యాన్స్ తనని సెల్ఫీ అడిగినందుకు అవమానించాడు. రారా నాతో రూమ్ కి వచ్చి సెల్ఫీ తీసుకో అంటూ అసహనం ప్రదర్శించాడు. బాబర్ బిహేవియర్ కు సెల్ఫీ కోసం వచ్చిన అభిమాని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Advertisement

ఆదివారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ వర్షం అంతరాయం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. అయితే సోమవారం కూడా వరుణుడు కరుణించలేదు. వస్తు పోతూ చిరాకు తెప్పించాడు. సోమవారం జరిగిన మ్యాచ్లో కొంతసేపు వర్షం అంతరాయం కలిగించింది. ఇరు జట్ల ఆటగాళ్లు డగౌట్ కు చేరారు. వర్షం ఆగిపోయిన తర్వాత పిచ్ ను పరిశీలించేందుకు బాబర్ అజామ్ మైదానంకు వచ్చాడు. ఈ క్రమంలో తిరిగి డగౌట్ కు వెళుతుండగా మైదానం సిబ్బంది ఒకరు సెల్ఫీ కోసం బాబర్ దగ్గరికి వచ్చాడు. సెల్ఫీ ఇవ్వకపోగా చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి సెల్ఫీ కోసం ప్రయత్నిస్తూ బాబర్ తో పాటే నడుస్తున్నారు. అప్పుడు బాబర్ చిరాకు పడి ఏంటి నాతో పాటు డ్రెస్సింగ్ రూమ్ కి వస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో ఆ ఫ్యాన్ బాబర్ కు దూరంగా వెళ్లిపోయాడు.

ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఫన్నీగా భయంతో ఉన్న బాబర్ ను ఎందుకు బ్రో గెలుకుతున్నావు అంటూ కామెంట్లు పెట్టారు. ఇదిలా ఉండగా మొన్న జరిగిన మ్యాచ్లో కోహ్లీ, రాహుల్ బీభత్సంగా ఆడారు. చెరో సెంచరీ బాది మ్యాచ్ స్వరూపాన్ని వన్ సైడ్ చేశారు. బ్యాటర్లు ఇలా ఆడితే బౌలర్లు అదరగొట్టారు. కుల్దీప్ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించాడు. దీంతో పాక్ పై టీమిండియా 228 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

Visitors Are Also Reading