భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి గత మూడేళ్లు ఎలా గడిచిందో అందరికి తెలిసిందే. 2019 లో చివరి సెంచరీ చేసిన విరాట్.. మూడేళ్లు సెంచరీ లేకుండా ఉన్నాడు. ఇక ఒక్క ఏడాది పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతూ అందరిచే విమర్శలు అందుకున్నాడు. ఇక అదే సమయంలో మన దాయాది పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ పరుగుల వరద పారిస్తూ అందరిచే ప్రశంసలు అందుకున్నాడు.
Advertisement
కానీ ఈ ఏడాది జరిగిన ఆసియా కప్ తో మొత్తం మారిపోయింది. ఈ ఆసియా కప్ లో కోహ్లీ సెంచరీతో పాటుగా.. ఫామ్ లోకి రాగ.. బాబర్ ఫామ్ కోల్పోయాడు. అంతే గత మూడేళ్ళుగా కోహ్లీకి జరిగినవి అన్ని బాబర్ కు జరుగుతూ వస్తున్నాయి. కోహ్లీ ఆడకపోయినా.. మూడేళ్లు అతడిని మన జట్టు కొనసాగించింది. కానీ బాబర్ ఒక్క టోర్నీలో విఫలమ్ కావడంతోనే పాక్ మాజీలు అతడిని విమర్శించడం ప్రారంభించారు.
Advertisement
అయితే గతంలో కోహ్లీని కూడా మాన మాజీలు దారుణంగా విమర్శించిన విషయం తెలిసిందే. అయితే మాజీల కామెంట్స్ పై బాబర్ స్పందిస్తూ.. మాజీ ఆటగాళ్లు చేసినా కామెంట్స్ వల్ల నాకు ఏం బాధ లేదు. వారు వారి అభిప్రాయాన్ని తెలిపారు. కానీ వారు నన్ను ఆట పరంగా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం అనేది నాకు భాధ కలిగిస్తుంది అని చెప్పాడు. అయితే కోహ్లీ కూడా ఇలాంటి కామెంట్స్ ఆసియా కప్ ముందు చేసిన విషయం తెలిసిందే. అందుకే కోహ్లీ గతమే బాబర్ కు భవిష్యత్ కానుందా అనే అనుమానాలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :