ఇండియా , పాకిస్థాన్ అనేది ఎప్పుడు పెద్ద చర్చే. ఎందుకంటే ఈ రెండు దేశాలు ఏ విషయంలో పోటీ పడిన అభిమానులు చాలా ఆసక్తిగా చూస్తారు. అది ఒకవేళ క్రికెట్ అయితే మరి ఎక్కువ. అయితే ఒక్కపుడు మన రన్ మిషన్ విరాట్ కోహ్లీని మాకు ఇచ్చేయండి అంటూ ఫ్లెక్సీలు పట్టుకున్న వారు ఇప్పుడు మొత్తం మారిపోయారు. ఎందుకంటే వారికీ జట్టులోకి ఓ స్టార్ ఆటగాడు వచ్చాడు. అతనే బాబర్ ఆజాం. అయితే మొదట్లో బాబర్ బాగానే ఆడిన అప్పుడు కోహ్లీ కూడా ఆడటంతో అతనికి అంత గుర్తింపు లేదు.
Advertisement
కానీ ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫామ్ లో లేడు అనే విషయం అందరికి తెలిసిందే. కానీ బాబర్ మాత్రం తన కెరియర్ లోనే పీక్ ఫామ్ లో అంటే విరాట్ కోహ్లీ 2016వ ఏడాది ఎలా బ్యాటింగ్ చేసాడో ఇపుడు అతను అలా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ నెలకొల్పోయిన రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తున్న బాబర్ తాజాగా కోహ్లీ యొక్క మరో రికార్డును బ్రేక్ చేసాడు. అదేంటంటే కెప్టెన్ గా వన్డేలో అతి తక్కువ ఇన్నింగ్స్ లలో 1000 పరుగులు చేయడం. గతంలో ఈ రికార్డ్ విరాట్ కోహ్లీ పేరిట 17 ఇన్నింగ్స్ లతో ఉండేది. కానీ ఇప్పుడు దానిని బాబర్ బ్రేక్ చేసాడు. బాబర్ కు కెప్టెన్ గా ఈ ఫిట్ సాధించడానికి కేవలం 13 ఇన్నింగ్స్ లు మాత్రమే పట్టాయి.
Advertisement
ప్రస్తుతం వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో తలపడుతుంది పాక్. ఇందులో మొదటి మ్యాచ్ లో నిన్న సెన్చారి చేసిన బాబర్ ఈ మార్క్ ను కోహ్లీ కంటే నాలుగు ఇన్నింగ్సుల ముందే అందుకున్నాడు. అయితే బాబర్ కు ఇది హాట్రిక్ సెంచరీ. గత రెండు వన్డే ఇన్నింగ్స్ లలో కూడా బాబర్ సెంచరీలు చేసాడు. కానీ ఇది బాబర్ కు రెండో సెంచరీల హాట్రిక్. ఇక గతంలో కూడా బాబర్ ఓ సారి చేసాడు. అయితే ఈ విధంగా డబల్ హాట్రిక్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు మాత్రమే బాబర్ ఒక్కడే. గతంలో ఈ ఫిట్ ను ఎవరు అందుకోలేకపోయారు.
ఇవి కూడా చదవండి :