ఇండియా vs పాకిస్థాన్ అనే మాట ఎక్కడ వినిపించిన కూడా దానికి ఉండే హైప్ అనేది వేరే లెవల్ లో ఉంటుంది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే ఈ రెండు దేశాలలోని నాయకులూ గాని.. ఆర్టిస్టులు గాని క్రికెటర్స్ గాని మరో దేశం గురించి మాట్లాడినప్పుడు అది చాలా త్వరాగా వైల్ అవుతుంది. ఇక ఈ రెండు దేశాలలో క్రికెట్ అనేది ఫ్యాన్స్ కు పిచ్చి. అందుకే ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అందరూ టీవీలకే అతుకుపోతారు అనేది నిజం. ఇక ఆ జట్లలోని ఆటగాళ్లు మరో జట్టు ఆటగాళ్ల గురించి మాట్లాడటం చాలా తక్కువ.
Advertisement
కానీ నిన్న అలాంటి ఘటన అనేది జరిగింది. ప్రస్తుతం టీం ఇండియా మాజీ కెప్టెన్. రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఫామ్ లో లేడు. పరుగులు చేయడానికి మాత్రమే కాకుండా… క్రీజులో నిలబడటానికి కూడా కోహ్లీ చాలా కష్టపడుతున్నాడు. అందుకే కోహ్లీని ఉద్దేశిస్తూ.. అతనితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి… ఈ కష్ట కాలం అనేది వెళ్ళిపోతుంది. స్ట్రాంగ్ గా ఉండు అంటూ పోస్ట్ చేసి.. కోహ్లీని ట్యాగ్ చేసాడు బాబర్. దాంతో ఈ ట్విట్ అనేది క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇక ఈ పోస్ట్ ను భారత్, పాక్ రెండు దేశాల అభిమానులు చాలా పాజిటివ్ గా తీసుకున్నారు. కానీ బాబర్ ఇలా ఎందుకు పోస్ట్ చేసాడు అనేది ఎవరికీ అర్ధం కాలేదు.
Advertisement
అయితే తాను కోహ్లీకి ఎందుకు సపోస్ట్ చేశాను అనే విషయాన్ని బాబర్ బయటపెట్టాడు. ఈరోజు పాకిస్థాన్ శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్ అనేది ప్రారంభమైంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు బాబర్ మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లీ చాలా గొప్ప ఆటగాడు. అయిన ప్రతి ఒక్కరికి ఇలాంటి సమయం అనేది వస్తుంది. అయితే అలాంటప్పుడు ఎలా అనిపిస్తుంది అనేది నాకు తెలుసు. ఏదో ఒక్కరోజు నేను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కుంటాను. అయితే అలాంటి సమయంలో ఎవరో ఒక్కరి సపోస్ట్ అనేది ఉండాలి. ఇక కోహ్లీ ఇప్పటికే ఎంతో క్రికెట్ ఆడాడు. అతనికి ఇందులో నుండి ఎలా బయటకు రావాలి అనేది తెలుసు బాబర్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :