తెలుగు బుల్లి తెరపై ఎన్నో కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను కడుపు ఉబ్బా నవ్విస్తుండే.. ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈయన జబ్బర్దస్త్ కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై ఎంతో గుర్తింపు సంపాదించుకుని అనంతరం బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి ఇంకా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.
బిగ్‌బాస్ నుండి బయటికొచ్చిన తరువాత వివిధ కార్యక్రమాలతో ఎంతో బిజిగా ఉండే అవినాష్ గత కొద్ది నెలల క్రితమే ఓ ఇంటివాడు అయ్యాడు. అవినాష్ అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వివాహం తరువాత తన భార్యతో కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఎన్నో వీడియోలు, రీల్స్, ఫోటో షూట్ అంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలోనే అవినాష్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన హోమ్ టూర్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ముక్కు అవినాష్ తన ఇంటిని తన స్కూల్ స్నేహితుడు జగదీష్ అనే వ్యక్తి డిజైన్ చేశారని, ఈ సందర్భంగా తన ఇంట్లో ప్రతీ అణువును వీడియో ద్వారా ప్రేక్షకులకు చూపించారు.
Advertisement
Advertisement
ఇక మూడు పడక గదులు కలిగిన ఇంటిని తమ అభిరుచులకు అనుగుణంగా డిజైన్ చేయించానని తన ఇంటిని మొత్తం చూపించడమే కాకుండా.. తనకు వచ్చిన బహుమతులు, అవార్డులను కూడా అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా భవిష్యత్‌లో వారికి పుట్టబోయే పిల్లల కోసం ఓ ప్రత్యేక మైన బెడ్రూంను తయారు చేయించినట్టు ఈ వీడియోలో అవినాష్ వెల్లడించారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఏడు సంవత్సరాల నుంచి ప్రతీ రూపాయిని పోగు చేసి అందమైన ఇంటిని నిర్మించుకున్నారు అవినాస్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. మీ జంట మాదిరిగానే మీ ఇల్లు కూడా చూడముచ్చటగా ఉందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.