Home » ఇప్పటికే 20 సార్లు ఆ పని చేశా….అవికా గోర్ సంచలనం !

ఇప్పటికే 20 సార్లు ఆ పని చేశా….అవికా గోర్ సంచలనం !

by Bunty
Ad

అవికా గోర్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ లో చిన్నారి ఆనందిగా నటించి ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది. తన అల్లరి మాటలతో, పనులతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఫిదా చేసింది. ఇక చిన్నారి పెళ్లికూతురు సీరియల్ అనంతరం ఈమె సినిమాల్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవికాగోర్ ఆసక్తికర వాక్యాలు చేసింది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ప్రారంభం నుంచి నేను ఇప్పటివరకు 20 సార్లు పెళ్లి చేసుకున్నాను.

avika ghor

avika ghor

20 సార్లు పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు బోర్ కొట్టలేదు. నాకు పెళ్లికూతురుల రెడీ అవడం అంటే చాలా ఇష్టం. మరోసారి వధువు లో నేను పెళ్లి కూతురిలా నటించాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి స్క్రిప్ట్ లో నేను ఇంతవరకు నటించలేదు. నాకు సీరియల్ లో, సినిమాలలో నటించిన అనుభవం ఉంది. బుల్లితెర ప్రేక్షకులకు ఎలాంటి కంటెంట్ ఇష్టం ఉంటుందో ఇందులో అదే ఉంటుంది.అతి చిన్న వయసులోనే నటిగా మారడం వల్ల నేను నా పర్సనల్ లైఫ్ ని కోల్పోయినప్పటికీ…. ప్రతిరోజు నేను ఓ కొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాను.

Advertisement

నిర్మాతగా పాప్ కార్న్ సినిమాను తీయడం చాలా గర్వంగా ఉంది. ఎలాంటి హంగామా లేకుండా కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంటాను. థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఈ సిరీస్ ఆసక్తికరంగా ఉంటుంది. నందు, అలీరెజా, అవికా గోర్ కలిసి నటించిన వెబ్ సిరీస్ వధువు. ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈనెల 8వ తేదీ నుంచి విడుదల కాబోతోంది. ప్రస్తుతం తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. అంతేకాకుండా హిందీలో పలు ప్రాజెక్టులతో నటిస్తూ బిజీగా ఉంది అవికా గోర్.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading