Home » భారత ఆటగాళ్ళకంటే ఎక్కువ జీతాలు అందుకుంటున్న ఆసీస్ ప్లేయర్స్..!

భారత ఆటగాళ్ళకంటే ఎక్కువ జీతాలు అందుకుంటున్న ఆసీస్ ప్లేయర్స్..!

by Azhar
Ad

ప్రపంచంలోనే ఉన్న అన్ని క్రికెట్ బోర్డుల కంటే మన బీసీసీఐ అత్యంత ధనికవంతమైన బోర్డుగా ఎంతో గుర్తింపు ఉంది. ఆలాగే ఐసీసీకి వచ్చే రెవెన్యూలో మన బీసీసీఐ 70 శాతం ఇస్తుంది. అలాగే ప్రపంచంలో ఏ జట్టులోని ఆటగాడికి రానంత జీతం అనేది మన భారత ఆటగాళ్లకు వస్తుంది అని అంటుంటారు. కానీ అది నిజం కాదు. మన భారత ఆటగాళ్ల కంటే మరో దేశ ఆటగాళ్లు ఎక్కువ జీతాలు అందుకుంటున్నారు. వారే ఆస్ట్రేలియా ఆటగాళ్లు. వారికీ మన ఆటగాళ్ల కంటే డబల్ జీతాలు వస్తున్నాయి.

Advertisement

తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్ల యొక్క జీతాలకు సంబంధించిన కాంట్రాక్టులను ప్రకటించింది. అందులో తమ టెస్టు జట్టులోని కీలక ఆటగాళ్ల జీతాలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. వారికీ వచ్చే జీతాలను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అక్కడ ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు కెప్టెన్ గా ఉన్న ప్యాట్ కమిన్స్ అందరికంటే ఎక్కువ వస్తుంది. అతనికి ఏడాదికి 2 మిలియన్ డాలర్లు వస్తున్నాయి. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు రూ. 15 కోట్లు. ఆ తర్వాత ఇప్పుడు బెంగళూర్ జట్టుకు ఆడుతున్న జోష్ హెజిల్వుడ్ కు 1.6 మిలియన్ డాలర్లు అంటే మన లెక్కలో సుమారు రూ. 12 కోట్లు వస్తున్నాయి.

Advertisement

అదే విధంగా డేవిడ్ వార్నర్ కు 1.5 మిలియన్ డాలర్లు అనగా మన ఇండియన్ రూపిస్ లో ఏడాదికి రూ. 11 కోట్లు ముడుతున్నాయి. ఇక స్టీవ్ స్మిత్ కు 10 కోట్లు, మిచెల్ స్టార్క్ కు 10 కోట్లు, లబూషేన్ 8 కోట్ల చొప్పున వస్తున్నాయి. కానీ మన భారత ఆటగాళ్లు సంపాదించేది చూసుకున్నట్లైతే… బీసీసీఐలో అత్యుత్తమ గ్రేడ్ ఏ ప్లస్ జాబితాలో ఉన్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రాలకు ఏడాదికి 7 కోట్లు మాత్రమే వస్తున్నాయి. ఇక ఆ తర్వాత ఏ, బీ, సీ కేటగిరీ లోని ఆటగాళ్లకు వరుసగా 5 కోట్లు, 3 కోట్లు, 1 కోటి ముడుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం చూస్తే ఏ బోర్డు ధనిక బోర్డు అనేది అందరికి క్లారిటీ వస్తుంది.

ఇవి కూడా చదవండి :

బాబర్ ఆజమ్ కోహ్లీతో సమానం అంటున్న దినేష్ కార్తీక్…

బట్లర్ నా రెండో భర్త అంటున్న సఫారీ ఆటగాడి భార్య..

Visitors Are Also Reading