Home » ఫైనల్ లో ఆస్ట్రేలియా చీటింగ్..! 

ఫైనల్ లో ఆస్ట్రేలియా చీటింగ్..! 

by Azhar
Ad
కామన్వెల్త్ గేమ్స్ లో ఈ ఏడాది ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్ లో భారత జట్టు సిల్వర్ సాధించింది. సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టును అద్భుతంగా ఓడించిన భారత జట్టు ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడింది. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించిన ఆస్ట్రేలియా.. చీటింగ్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని ఇంకా కరోనా వైరస్ వదిలి వెళ్ళలేదు. అందుకే అందరూ కరోనా నియమాలను పాటిస్తున్నారు.
ఈ కామన్వెల్త్ గేమ్స్ లో కూడా ఈ నియమాలు ఉన్నాయి. ఎవరైనా ప్లేయర్ కరోనా పాజిటివ్ గా తేలితే వారిని ఐసోలేషన్ లోకి పంపించాలి. కానీ ఇదే నియమని ఆస్ట్రేలియా ఉల్లంఘించింది. ఇండియాతో మ్యాచ్ కు ముందు చేసిన కరోనా పరీక్షలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ తహిలా మెక్‌గ్రాత్‌కి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కానీ ఆమెలో ఆ లక్షణాలు అనేవి కనిపించలేదు. అందువల్ల తహిలా మెక్‌గ్రాత్‌ ను జట్టు నుండి తప్పించలేదు.
ఈ ఫైనల్స్ కు ముందు జరిగిన అన్ని మ్యాచ్ లలో తహిలా మెక్‌గ్రాత్‌ రాణించడంతో.. ఆమె ఉంటె విజయం సాధించవచ్చు అని ఆలోచించి ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ జట్టు నుండి తప్పించలేదు. ఇక మ్యాచ్ అనంతరం ఈ విషయం అనేది బయటకు వచ్చింది. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా ప్లేయర్స్ అందరూ క్వారంటైన్ లోకి వెళ్లారు. కరోనా నెగెటివ్ వచ్చిన తర్వాతే తిరిగి ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. కానీ ఆసీస్ జట్టు చేసిన పనిపై కామన్వెల్త్ మేనేజ్మెంట్ ఏ విధమైన చర్యలు అనేవి తీసుకుంటుందో చూడాలి.

Advertisement

Visitors Are Also Reading