Home » ఆస్ట్రేలియా అమ్మాయి..బీహార్ అబ్బాయి….ప్రేమ పెళ్ళిలో ఎన్ని ట్విస్టులో….!

ఆస్ట్రేలియా అమ్మాయి..బీహార్ అబ్బాయి….ప్రేమ పెళ్ళిలో ఎన్ని ట్విస్టులో….!

by AJAY
Ad

కంప్యూటర్ యుగంలో జీవనవిధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆచారాలు… సాంప్రదాయాలు ఇలా ప్రతి విషయంలోనూ మార్పులను గమనిస్తూనే ఉన్నాం. ఇక పెళ్లిళ్ల విషయంలోనూ ఈ మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అదే ఊరిలో లేదంటే పక్క ఊరిలో సంబంధాలు కుదుర్చుకొని పెళ్లిళ్లు చేసుకునే వారు. కానీ ఇప్పుడు రాష్ట్రాలు… దేశాలు దాటి మరీ సంబంధాలు కుదుర్చుకుంటున్నారు…. వివాహాలు చేసుకుంటున్నారు.

Advertisement

తాజాగా బీహార్ కు చెందిన ఓ యువకుడు ఆస్ట్రేలియా దేశానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియా బీహార్ కు చెందిన జయప్రకాష్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. బీహార్ లోని బాక్సర్ జిల్లా కుదా గ్రామానికి చెందిన నందు లాల్ సింగ్ యాదవ్ కుమారుడు జయప్రకాష్ ఉన్నత చదువుల కోసం మూడేళ్ళ క్రితం ఆస్ట్రేలియాకు వెళ్ళాడు.

Advertisement

జయప్రకాష్ కు అక్కడే మెల్బోర్న్ నగరంలో నివాసం ఉంటున్న విక్టోరియా తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇక జయప్రకాష్ కు ఆస్ట్రేలియాలోనే ఉద్యోగం వచ్చింది. దాంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించారు. విక్టోరియా తల్లిదండ్రులతోపాటు జయప్రకాష్ తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నారు.

రాఘవేంద్ర రావు చేసిన ఆ పనికి చిరంజీవికి అన్ని తలనొప్పులు వచ్చాయో తెలుసా ?

అయితే తన కుమారుడి పెళ్లి బీహార్ లోనే జరగాలని అబ్బాయి తండ్రి చెప్పాడు. దాంతో విక్టోరియా కుటుంబం బీహార్లోని జయప్రకాష్ గ్రామానికి చేరుకున్నారు. వీరిద్దరి వివాహం ఏప్రిల్ 20న హిందూ ఆచారాల ప్రకారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….. పెళ్లి చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పింది. అంతేకాకుండా విక్టోరియా తండ్రి మాట్లాడుతూ….బీహార్ సంస్కృతి చాలా బాగుందని అన్నారు. ఇక్కడి ఆచార వ్యవహారాలు సంస్కృతి చూస్తుంటే ముచ్చటగా ఉందని చెప్పారు.

Visitors Are Also Reading