ఇరవై నాలుగు ఏళ్ల తరువాత ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్తాన్‌లోకి అడుగుపెట్టింది. ఆదివారం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చార్టర్డ్ విమానంలో పాకిస్తాన్‌కు చేరుకుంది. 1998 తరువాత ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. అందుకే ఈ పర్యటన ఎంతో చారిత్రాత్మకమైనదిగా మారినది. ఈ పర్యనటపై ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్‌లో క్రికెట్ పునఃప్రారంభమైన తరువాత ఇదే అతిపెద్ద పర్యటన. పాకిస్తాన్ క్రికెట్‌కు ఇది మైలు రాయి. స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియన్ జట్టు పాకిస్తాన్ చేరుకున్న తొలి చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కంగారులు పాకిస్తాన్ తో టీ20లతో పాటు 3 టెస్ట్ మ్యాచ్‌లు, 3 వన్డే సిరీస్ ఆడాల్సి వచ్చింది. ముఖ్యంగా పాక్‌లోని రావాల్పిండి, లాహోర్, కరాచీలలో మ్యాచ్‌లు జరగనున్నాయి.
Advertisement
ఆస్ట్రేలియా జట్టు తన పూర్తి బలంతో పాకిస్తాన్‌కు చేరుకుంది. వారు చాలా ప్రిపరేషన్ కూడా చేసుకున్నారు. పాకిస్తాన్ బయలుదేరే ముందు, ఆటగాళ్లకు శిక్షణ శిబిరం కూడా నిర్వహించారు. స్వదేశంలో చేసిన సన్నద్ధత పాక్ పిచ్‌లపై ఎంతవరకు ఉపయోగపడుతున్నదో మరికొద్ది రోజుల్లో తెలియనున్నది.
Advertisement
పాక్ పర్యటనకు ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు.. పాట్ కమిన్స్ (కెప్టెన్స్), డేవిడ్ వార్నర్, మార్కస్ హారిస్, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), ట్రావిస్ హెడ్, కెమెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ, మిచెల్ స్టార్క్ , నాథన్ లియోన్, జోష్ హేజిల్ వుడ్, అష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, జోష్ ఇంగ్లీస్, ఉస్మాన్ ఖవాజా, మిచెల్ మార్ష్, మిచెల్ నెసెర్, మిచెల్ స్వెప్సన్.
వన్డే జట్టు : ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆస్టన్ అగర్, జాసన్ బెహ్రెన్‌డార్ప్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, కెమెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోస్ ఇంగ్లీస్, మార్నస్ లూబుస్ చాగ్నే, మిచెల్ మార్ష్, బెన్ మెక్‌డెర్మోట్, కనీవ్ మెక్‌డెర్మోట్, పాక్‌పై ఆస్ట్రేలియా వన్డే, టీ20 జట్టు స్మిత్, మాస్కస్ స్టొయినిస్ ఆడమ్ జంపా.
Arrived in 🇵🇰 pic.twitter.com/pnis0ckFeO
— Steve Smith (@stevesmith49) February 27, 2022