Home » Diwali : దీపావళి రోజు ఈ జంతువుల్ని చూస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం పక్కా !

Diwali : దీపావళి రోజు ఈ జంతువుల్ని చూస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం పక్కా !

by Bunty
Ad

హిందూ సాంప్రదాయం ప్రకారం దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ప్రతి ఇంట లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇల్లు శుభ్రం చేసుకొని, లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకొని, దీపాలు వెలిగించి, నైవేద్యాలు పెట్టి, పూలు, పండ్లతో, బంగారం, డబ్బులతో అలంకరిస్తారు. అయితే శాస్త్రాల ప్రకారం దీపావళి రోజున కొన్ని రకాల జంతువుల్ని చూడడం వల్ల ఎంతో అదృష్టం కలుగుతుందట. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందట.

Auspicious Signs That Show Goddess Lakshmi Will Visit on Diwali

శునక శాస్త్రం ప్రకారం దీపావళి రోజున కుంకుమ పువ్వు రంగుతో ఉన్నటువంటి ఆవుని చూడడం శుభప్రదంగా భావిస్తారట. దీపావళి రోజున ఆవుని దర్శించుకోవడం వల్ల చాలా మేలు కలుగుతుందట. అంతేకాకుండా బల్లులు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండడం సర్వసాధారణం. కానీ దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ అనంతరం బల్లులు కనిపించినట్లయితే అవి చాలా శుభప్రదంగా భావించాలి. దీపావళి రోజున గుడ్లగూబను కూడా చూడడం చాలా శుభప్రదం.

Advertisement

Advertisement

గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. దీపావళి రోజున రాత్రి సమయంలో గుడ్లగూబను చూసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందినట్లు అవుతుందట. దీపావళి పండుగ రోజున ఇంట్లో ఎలుక కనిపించినట్లయితే అదృష్టంగా భావించాలి. శునక శాస్త్రం ప్రకారం ఎలుక దర్శనం డబ్బురాకకి సూచకగా భావించాలి. ఇక పిల్లిని కూడా చాలామంది అశుభంగా భావిస్తారు. కానీ దీపావళి రోజున ఇంట్లోకి పిల్లి వచ్చినట్లయితే లక్ష్మీదేవి రాకగా భావించాలి. ఈ జంతువులను దీపావళి రోజున దర్శించుకోవడం వల్ల ఎంతో మేలు కలిగి కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading