Home » ‘అతడు’ సినిమాలోని ఈ చిన్నోడు..హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు

‘అతడు’ సినిమాలోని ఈ చిన్నోడు..హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు

by Bunty
Ad

మహేష్ బాబు కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో అతడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో సోనుసూద్, మహేష్ బాబుకు స్నేహితుడుగా నటించి అతడినే మోసం చేసే పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన మాటలు బుల్లెట్లలా దూసుకుపోతాయి. సినిమాలోని ఒక్కో డైలాగ్ ఒక్కో రేంజ్ లో ఉండటంతో థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి.

Advertisement

 

అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నోడు కూడా అదే రేంజ్ లో ఫేమస్ అయ్యాడు. ఆ చిన్నోడి పేరు దీపక్ సరోజ్. అతడు బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ నవ్వులు పూయించాయి. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆర్య, భద్ర, మినుగురులు, లెజెండ్ తదితర చిత్రాల్లో బాలనటుడిగా కనిపించిన దీపక్ ఇప్పుడు హీరోగా మారాడు.

Advertisement

దీపక్ కథానాయకుడిగా డైరెక్టర్ వి.యశస్వి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ రాయ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో తన్వి నేగి కథనాయికగా నటిస్తోంది. ఈ సినిమా కంటే ముందే దీపక్ హీరోగా తొలిసినిమా బంధనం మూవీతో పరిచయమయ్యాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా, దీపక్ నటనకు మంచి పేరు తెచ్చింది.

READ ALSO : Michael OTT : “మైఖేల్” ఓటిటి డేట్ ఫిక్స్… ఎందులో స్ట్రీమింగ్ కానుంది అంటే?

Visitors Are Also Reading