Home » మేష రాశి వారి జాతకం అద్భుతం.. జ్యోతిష్యుడు వేణుస్వామి ఏమన్నారంటే..?

మేష రాశి వారి జాతకం అద్భుతం.. జ్యోతిష్యుడు వేణుస్వామి ఏమన్నారంటే..?

by Anji
Published: Last Updated on
Ad

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసి వైరల్ అవుతూనే ఉన్నారు. ఇక ఇటీవల స్టార్ సెలబ్రిటీస్ జాతకం గురించి కూడా  ఓపెన్ గానే చెప్పేశారు వేణుస్వామి. దీంతో ఆయన చాలా పాపులర్ అయిపోయారు. అదేవిధంగా చెప్పినవి కూడా చాలా వరకు కచ్చితంగా జరిగాయి. వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా వేణు స్వామి మేషరాశి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 22న గురు గ్రహ సంచారం జరగబోతుందని.. దీంతో మేష రాశి వారికి శుభ ఫలితాలు కలగనున్నాయట. 

Also Read :  ఆడవాళ్లు బరువు తగ్గాలంటే ఇలా చేస్తే అద్భుతమైన ఫలితం..!

Advertisement

Venu Swamy

Venu Swamy

 అందుకోసమే వేణు స్వామి మేషరాశి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 22న గురుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని కూడా కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రెండు మార్పుల వల్ల మేష రాశికి మంచి జరగబోతుంది. ఈ మేష రాశి వారికి గురువుకు సంబంధించి, శనికి సంబంధించి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఇలా అందరికీ విశేష యోగ ఫలం కలగనుంది. ఏప్రిల్ వరకు 80% , 90% స్పీడ్ వరకు వెళ్లే మేష రాశి వారి జాతకం ఏప్రిల్ 23 నుండి 100% స్పీడుతో దూసుకెళుతోంది.  

Advertisement

Also Read :  పానీపూరిని అతిగా తింటున్నారా? అయితే…ఈ రోగాల బారిన పడాల్సిందే..!

Venu Swamy

గురువు మేషరాశిలోకి ప్రవేశించడం వల్లనే వీరికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇలాంటి ఆనందకరమైన పరిస్థితి మేష రాశి వారికి ఈ మధ్యకాలంలో రాలేదు అనే చెప్పుకోవచ్చు. అంత ఆనందకరమైన పరిస్థితి, పాజిటివ్ ఎనర్జీ ఈ సంవత్సరం మేషరాశి వారికి కలగబోతుంది. మేష రాశి వారికి రెండున్నర సంవత్సరాల దాకా తిరుగు లేదని చెప్పవచ్చు. శని పరంగా, గురుపరంగా మేషరాశి వారికి చాలా అనుకూలంగా డబోతుంది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా ఇలా అన్ని విధాలుగా మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. అన్ని రాశులలోకెల్లా మేషరాశికి ఈ ఏడాది చాలా బాగా ఉండబోతుంది అని వేణు స్వామి చెప్పుకొచ్చారు. 

Also Read :  Writer Padmabhushan : ఓటీటీలోకి ‘రైటర్ పద్మభూషణ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Visitors Are Also Reading