Home » ఆడవాళ్లు బరువు తగ్గాలంటే ఇలా చేస్తే అద్భుతమైన ఫలితం..!

ఆడవాళ్లు బరువు తగ్గాలంటే ఇలా చేస్తే అద్భుతమైన ఫలితం..!

by Anji
Ad

సాధారణంగా మనిషికి బరువు అనేది చాలా ముఖ్యం.  కొందరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే.. మరికొందరు బరువు పెరగడానికి ప్రయత్నిస్తుంటారు. బరువు ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే.. తక్కువ ఉన్న ప్రాబ్లమే.. ఏది ఏమైనా ఈ రెండు సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలి. ప్రస్తుతం అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఓవర్ వెయిట్ వల్ల అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్, మధుమేహం, గుండెపోటు, స్ట్రోక్ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. పురుషులతో పోలిస్తే మహిళలు కూడా అధిక బరువు బారిన ఎక్కువగా పడుతుంటారు. 

Also Read :  ఠాగూర్ సినిమా లోని ఈ సీన్స్ రిపీట్ ! ప్రాణం కాపాడవలసిన డాక్టర్స్ ఎలాంటి పని చేసారంటే ?

Advertisement

ఇందుకు ప్రధాన కారణాలు వ్యాయామం చేయకపోవడం, కొన్ని అనారోగ్య సమస్యలు, చెడు ఆహారం వంటివి ఉన్నాయి. అధిక బరువును కొద్ది నెలల్లోనే తగ్గించుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే బరువు తగ్గడానికి వాళ్లు ఏమేం చేశారో మీరు అవి చేసినప్పటికీ కూడా తగ్గకపోవచ్చు. బరువును తగ్గించే ప్రణాళికలు ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా పనిచేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ.. నిపుణుల సలహాలు తీసుకుని ఆహార ప్రణాళికతో   ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. కానీ బరువు తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది. ముఖ్యంగా మహిళలు బరువు తగ్గడానికి ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం  తెలుసుకుందాం.  

Also Read :  వీరసింహారెడ్డి సినిమా చూస్తుంటే ఆ సినిమా గుర్తుకొస్తుంది.. ఇంకా పరుచూరి గోపాలకృష్ణ ఏమన్నారంటే ?

Advertisement

Manam News

  • తరచుగా ఆకలి వేయకుండా చూసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల  కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలిగి త్వరగా ఆకలివేయదు. అయితే ఆకలి అనేది డైటింగ్ కాదని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా  మీరు తినే సమతుల్య ఆహారంలో మాక్రోన్యూట్రియెంట్స్  పుష్కలంగా ఉండే విధంగా  చూసుకోవాలి. 
  • తినే ఆహారంలో ప్రధానంగా పోషకాలు ఉండేవిధంగా చూసుకోవాలి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలను మాత్రమే తీసుకోవాలి.  మీకు ఇష్టమైనవి అప్పుడప్పుడు మాత్రమే తినాలి. 
  • బరువు తగ్గడానికి మీరు ఎంచుకున్న డైట్ ప్లాన్ మీ ఆహార విధానం, వ్యాయామ స్థాయికి సరిపోయేవిధంగా ఉండాలి. ఎక్కువగా కష్టపడి పోషకాలు తక్కువగా ఉండే ఆహారాన్ని తింటే మీ ఒంట్లో శక్తి తగ్గుతుంది. ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. అదేవిధంగా మీరు తినే ఫుడ్ మీ కడుపును ఎక్కువ సేపు నిండేలా చేస్తుంది. 
  • ముఖ్యంగా తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్, తక్కువ కేలరీలు, తక్కువ కార్బోహైడ్రేట్లు వంటి వివిధ రకాల ఆహారాలను ఎంచుకోవచ్చు. బరువు తగ్గాలని పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తింటే మీ శరీరంలో పోషకలోపం ఏర్పడుతుంది. దీంతో రక్తహీనత, బలహీనమైన ఎముకలు, ఒంట్లో శక్తి తగ్గడం, లో బీపీ వంటి సమస్యలు తలెత్తుతాయి. మీరు తినే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండేవిధంగా చూసుకోవాలి. 

Also Read :   విటమిన్ D లోపించడం వల్ల షుగర్ వ్యాధి వచ్చే అవకాశముందా..?

Visitors Are Also Reading