Home » వేణు స్వామి చెప్పిన‌ట్టే న‌య‌న‌తార జీవితంలో స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయా..?

వేణు స్వామి చెప్పిన‌ట్టే న‌య‌న‌తార జీవితంలో స‌మ‌స్య‌లు మొద‌ల‌య్యాయా..?

by Bunty
Ad

సెలబ్రిటీలు, రాజకీయాల జీవితాలకు సంబంధించి అందరికీ సంబంధించిన జాతకాలను చెబుతూ వార్తలలో నిలుస్తుంటాడు వేణుస్వామి. సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పడం అది వాస్తవం అవ్వడంతో మనోడు తెగ పాపులర్ అయ్యాడు. ఇక అప్పటినుంచి తన నోటికి వచ్చినవి ఏవో చెబుతూ వస్తున్నాడు.

Also Read:  వీరసింహారెడ్డిలో బాలయ్య మూడు పాత్రల్లో కనిపించనున్నారా..?

Advertisement

ఇక ఇటీవల లేడీస్ సూపర్ స్టార్ నయనతార పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. నయనతార కి పెళ్లి అచ్చి రాదని, వివాహం తర్వాత ఆమె జీవితంలో కలతలు, విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అవి విడాకుల దాకా దారి తీసే అవకాశం కూడా ఉందంటూ వేణు స్వామి కొద్ది రోజుల క్రితం చెప్పారు.

Advertisement

అయితే దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్ లో నయనతార, విగ్నేష్ శివన్ జంట ఈ ఏడాది జూన్ 9న వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయ్యాక ఏదో ఒక వివాదం నయనతారని చుట్టుముడుతూనే ఉంది.నయనతార నటించిన కనెక్ట్ సినిమా డిసెంబర్ 22న తమిళ, తెలుగు భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. హాలీవుడ్ సినిమాల ఫార్మాట్ లో ఈ మూవీ నిడివి నీ కేవలం 90 నిమిషాలకు కుదించారు. అంతేకాకుండా నిడివి తగ్గడంతో సినిమాకు ఇంటర్వెల్ లేకుండా కంటిన్యూగా ఎండ్ వరకు ప్రదర్శించబోతున్నారు. ఇదే ఇప్పుడు నయనతార సినిమాకు పెద్ద ఇబ్బందికరంగా మారినట్టుగా తెలుస్తోంది. హాలీవుడ్ సినిమాలు మూడు గంటలకు నిడివికి పైనే ఉంటున్న ఈ రోజుల్లో నయన సినిమా కేవలం గంట 30 నిమిషాలే ఉండటం గమనార్హం.

ఇదే ఇప్పుడు తమిళనాట ఈ మూవీకి పెద్ద ఇబ్బందికరంగా మారినట్టుగా తెలుస్తోంది. నిడివి కారణంగా అసలు విరామమే లేకుండా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీకి ఎగ్జిబిటర్లు షాక్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. తమిళనాడులోని థియేటర్ల యజమానులు ఈ మూవీని ప్రదర్శించడానికి ముందుకు రాకపోవడం పలువురిని షాక్ కు గురిచేస్తోంది. తమిళనాడు లోని లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటున్న నయనతార సినిమాకు ఇలాంటి పరిస్థితి ఏంటని అంతా అవాక్కవుతున్నారు.

READ ALSO : టాలీవుడ్‌ లో బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్నా..హీరోయిన్లుగా అట్టర్‌ ఫ్లాఫ్‌ అవుతున్న తారలు వీరే !

Visitors Are Also Reading