Home » ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి నటించిన రెండు తెలుగు సినిమాలు ఏవో తెలుసా ?

ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి నటించిన రెండు తెలుగు సినిమాలు ఏవో తెలుసా ?

by Bunty
Published: Last Updated on
Ad

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి బాగా తెలుసు. ప్రతి ఒక్కరి… మొబైల్ ఫోన్లో కనిపిస్తూ ఉంటాడు వేణు స్వామి.నిత్యం ఏదో ఒక అంశంపై… వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు జ్యోతిష్యుడు వేణు స్వామి. ముఖ్యంగా రాజకీయాల్లో మరియు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు.

venuswamy-in-movies

Advertisement

ముఖ్యంగా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ… నిత్యం చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ లలో కనిపిస్తూ ఉంటాడు వేణు స్వామి. సమంత మరియు నాగచైతన్య ఇద్దరు విడిపోతారని ముందే చెప్పాడు వేణు స్వామి. అతను చెప్పినట్టుగానే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అలాగే… నందమూరి కుటుంబంలో ఓ హీరో మరణిస్తారని… ఇన్ డైరెక్ట్ గా తారకరత్న గురించి చెప్పాడు వేణు స్వామి.

venuswamy

అయితే వేణు స్వామి యూట్యూబ్ లో కనిపించడమే కాకుండా గతంలో సినిమాలు కూడా చేశాడు. జగపతిబాబు హీరోగా చేసిన జగపతి అనే సినిమాలో… గుళ్లో పూజారి పాత్ర చేశాడు వేణు స్వామి. ఈ సినిమాలో వేణు స్వామికి రెండు డైలాగులు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే ప్రిన్స్ మహేష్ బాబు నటించిన అతడు సినిమాలో సైతం ఓ పాటలో కనిపించాడు వేణు స్వామి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading