ఆసియా కప్ 2018 లో చివరిసారిగా యూఏఈలో జరిగింది. అందులో రోహిత్ శర్మ న్యాయకత్వంలో పాల్గొన మన భారత జట్టు ఛాంపియన్స్ గా నిలిచింది. అయితే రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఈ ఆసియా కప్ 2020 లో కూడా జరగాలి. కానీ కరోనా కారణంగా అది జరగలేదు. కానీ ఇప్పుడు ఈ ఏడాది యూఏఈ వేదికగా మళ్ళీ ఆసియా కప్ అనేది జరగనుంది. అసలు ఈ టోర్నీ శ్రీలంకలో జరగాలి.. కానీ అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా యూఏఈకి తరలించారు.
Advertisement
ఇక తాజాగా ఈరోజు ఆసియా కప్ 2022 యొక్క సెహెడ్యూల్ అనేది విడుదల చేసారు. ఆగస్టు 27న ఈ టోర్నీ అనేది ప్రారంభం కానుంది. 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీకి ఇప్పటికే 5 జట్లు క్వాలిఫై కాగా ఇంకా ఒక్క జట్టు క్వాలిఫై కావాలి. అయితే ఈ టోర్నీలో మన భారత జట్టు మొదటి పోరే దాయాధి దేశం అయిన పాకిస్థాన్ తో చేయనుంది. 27న శ్రీలంక – ఆఫ్ఘానిస్తాన్ జట్లు తలపడిన తర్వాత 28న భారత్ , పాకిస్థాన్ ఎదురుపడనున్నాయి.
Advertisement
అయితే గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ లో పాకిస్థాన్ పై మన ఓటమికి ప్రతీకారం అనేది తీర్చుకోవాలి అని ప్రతి భారతీయుడు అనుకుంటున్నారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత ఈ నెల 31న ఇప్పుడు క్వాలిఫై కాబోయే ఆరో జట్టుతో టీం ఇండియా ఆ తర్వాత సెప్టెంబర్ 1 నుండి సూపర్ 4 అనేది ప్రారంభం అవుతుంది. ఇక సెప్టెంబర్ 11న ఫైనల్స్ తో ఈ టోర్నీ ముగుస్తుంది.
ఇవి కూడా చదవండి :