Home » అశ్విన్ లక్కీ ఆటగాడా.. అన్ లక్కీ ఆటగాడా..?

అశ్విన్ లక్కీ ఆటగాడా.. అన్ లక్కీ ఆటగాడా..?

by Azhar
Ad
ఐపీఎల్ 2008 లో ప్రారంభమై తాజాగా విజయవంతంగా తమ 15వ సీజన్ ను పూర్తి చేసుకుంది. అయితే అప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన 15 సీజన్ లలో ఒక్క సీజన్ కూడా మిస్ చేయకుండా చాలా తక్కువ మంది ఆటగాళ్లే ఆడారు. అలాంటి వాళ్లలో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒక్కడు. అయితే ఐపీఎల్ లో కరణ్ శర్మ లక్కీ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అశ్విన్ మాత్రం అశ్విన్ లక్కీ ఆటగాడా.. అన్ లక్కీ ఆటగాడా అనే విషయం మాత్రం అర్ధం కావడం లేదు. ఎందుకంటే గత 15 సీజన్ లలో 9 ఫైనల్ మ్యాచ్ లు ఆడిన ఆశ్విన్ 7 సార్లు ఓడిపోయాడు.
ఐపీఎల్ ప్రారంభం సీజన్ లో ఆశ్విన్ ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 2008లో రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో ఫైనల్‌ మ్యాచ్ లో ఓడిపోయింది. ఆ తర్వాత అదే జట్టు తరపున 2010, 2011 సీజన్ లలో ఛాంపియన్ గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్… మళ్ళీ వరుసగా 2012, 2013, 2015 సీజన్లలో రన్నరప్‌గా ముగించిన చెన్నై టీమ్‌లో ప్లేయర్‌గా ఉన్నాడు. ఆ తర్వాత రెండేళ్లు చెన్నై బ్యాన్ కావడంతో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.

ఇక 2017 లో అశ్విన్ ఆడుతున్న రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌ ఫైనల్స్ కు వెళ్లి అక్కడ ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్ గా నిలిచింది. అదే విధంగా ఐపీఎల్ కెరియర్ లో మొదటిసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2020 లో ఫైనల్స్ కు చేరగా.. అందులోనూ అశ్విన్ ఉన్నాడు. అక్కడ మళ్ళీ ముంబై చేతిలోనే ఢిల్లీ ఓడిపోయింది. ఇక తాజాగా ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్ గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టులోని అశ్విన్ ఉన్నాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇలా 9 సార్లు ఫైనల్స్ కు చేరిన జట్టులో ఉన్నందుకు అశ్విన్ ను లక్కీ ఆతగ్గాడు అనుకోవాలా.. లేక అందులో 7 సార్లు తన జట్టు ఓడిపోయినందుకు అన్ లక్కీ ప్లేయర్ అనుకోవాలా అనేది మాత్రం తెలియడం లేదు.

Advertisement

Advertisement

ఇవి కూడా చదవండి :

కేకేఆర్ కోచ్ మెక్ కల్లమ్ పై దారుణమైన ట్రోల్స్.. ఎందుకో తెలుసా..?

హార్దిక్ ను విమర్శించినా వారికి కృనాల్ సమాధానం..!

Visitors Are Also Reading