Home » హార్దిక్ ను విమర్శించినా వారికి కృనాల్ సమాధానం..!

హార్దిక్ ను విమర్శించినా వారికి కృనాల్ సమాధానం..!

by Azhar
Ad
2019 ప్రపంచ కప్ ముందు వరకు భారత జట్టులో ముఖ్యమైన ఆల్ రౌండర్ గా ఉన్న హెదిక్ పాండ్య ఆ తర్వాత… వెనుముఖకు శస్త్ర చికిత్స చేయించుకొని కొన్ని నెలలో ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన పాండ్య అంతక ముందు చేసిన ప్రదర్శన చేయలేకపోయాడు. బౌలింగ్ కు పూర్తిగా ధూసరమైన పాండ్య బ్యాటింగ్ లో అప్పుడపుడు మెరుపులు మెరిపించాడు. కానీ అవి అంతగా కనిపించలేదు.
దాంతో భారత జట్టులో స్థానం కోల్పోయిన పాండ్యను ఈ ఐపీఎల్ మెగావేలానికి తన ముంబై ఇండియన్స్ కూడా వదిలేసింది. అప్పుడే కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్ పాండ్యను తీసుకొని తమ జట్టుకు కెప్టెన్ గా నియమించింది. అప్పుడు ఆ జట్టు యాజమాన్యం పై కూడా చాలా విమర్శలు వచ్చాయి. పని అయిపోయిన పాండ్యను ఎందుకు కెప్టెన్ చేశారు అని ప్రశ్నించాడు. కానీ అదే పాండ్య ఈ సీజన్ లో ఆ జట్టును ఛాంపియన్ గా నిలిపాడు.
అందువల్ల హార్దిక్ ను విమర్శించిన వారిని ఉద్దెశించి కృనాల్ పాండ్య ట్విట్ చేసాడు. ‘బ్రో.. నీ విజయం వెనుక దాగి ఉన్న  హార్డ్ వర్క్ నీకు ఒక్కనికే తెలుసు. నీ ట్రైనింగ్, క్రమశిక్షణ, మానసిక దృఢత్వం.. ఇవన్నీ నీ విజయానికి కారణాలు.. నువ్వు అక్కడ ట్రోఫీని అందుకున్నావంటే అదంతా నీ కష్టానికి ప్రతిఫలంగా అనిపిస్తుంది.  ఈ విజయానికి వంద శాతం నువ్వు అర్హుడవె. కొంతమంది  నీ పని అయిపోయిందని.. నువ్వు ఇక క్రికెట్ కు పనికిరావని కామెంట్స్ చేసారు. వారు తప్పు అని ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేశావ్” అంటూ తమ్ముడ్ని గురించి అన్న తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Advertisement

Visitors Are Also Reading