Ad
ఐపీఎల్ 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. లీగ్ దశలో దూకుడుగా ఆడిన టైటాన్స్ జట్టు క్వాలిఫైర్స్ 1 లో రాజస్థాన్ పైన అలాగే ఆడింది. ఇక నిన్న మళ్ళీ అదే రాజస్థాన్ జట్టును చాలా సునాయాసంగా ఓడించి టైటిల్ అందుకుంది. అయితే గుజరాత్ ఆటగాళ్లు లీగ్ మ్యాచ్ లలో ఎలా అయితే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడారో ఫైనల్స్ లో కూడా అలానే కనిపించరు. అలా ఎటువంటి ఒత్తిడి, టెన్షన్ లేకుండా మ్యాచ్ ను చాలా సులువుగా ముగించారు.
అయితే ఈ జట్టు ఇలా స్వేచ్ఛగా ఆడటానికి ముఖ్య కారణం ఆ జట్టు హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా. మామూలుగానే నెహ్రా ఎంతో సరదాగా.. ఎటువంటి టెన్షన్స్ లేకుండా తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. ఎప్పుడు నవ్వుతు.. తన వహుట్టు ఉన్నవాళ్లను కూడా నావిస్తూ ఉంటాడు. అటువంటి నెహ్రాను జట్టు హెడ్ కోచ్ గా గుజరాత్ యాజమాన్యం తీసుకున్నప్పుడు కొని విమర్శలు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు వాటికీ తన స్టైల్ లోనే చెక్ పెట్టసాడు నెహ్రా.
ఆటగాళ్లను ఒత్తిడికీ గురి చేయకుండా వారికీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. అలాగే జట్టులో ఎక్కువగా మార్పులు చేయకుండా… జట్టు కాంబినేషన్ చెడిపోకుండా జాగ్రత్త పడ్డాడు నెహ్రా. ఇక ఫైనల్ మ్యాచ్ అంటేనే చాలా జట్ల హెడ్ కోచ్ లు ఆయా జట్లకు డ్రెసింగ్ రూమ్ లో పెద్ పెద్ద స్పీచ్ లు ఇస్తారు. కానీ నెహ్రా మాత్రం కేవలం మూడు మాటలు చెప్పాడు అంతే. ఇంతకు అవేంటంటే.. బాగా తినండి… మంచిగా నిద్రపోండి… వెళ్లి కప్పు తీసుకురండి అని మాత్రమే చెప్పాడు. దాని ఫలితం మనకు గ్రౌండ్ లోనే కనిపించింది. ఏ మాత్రం టెన్షన్ లేకుండా ఆడిన గుజరాత్ కప్పును తీసుకెళ్లింది.
ఇవి కూడా చదవండి :
హార్దిక్ పాండ్య డ్రీమ్ ఐపీఎల్ కాదంట.. ఏంటో తెలుసా మరి..?
ఢీల్లీ క్యాపిటల్స్ కు ఆడుతూ.. రాజస్థాన్ రాయల్స్ కు మద్దతు ఇస్తున్నాడు..!
Advertisement