భారత జట్టుకు 2016 లో పూర్తి స్థాయి కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ ఈ ఏడాది ఆరంభంలో పూర్తిగా అన్ని ఫార్మట్స్ లో కెప్టెన్సీ నుండి తప్పుకొని.. ఇప్పుడు జట్టులో మాములు ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే మొదట గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ తర్వాత నేను టీ20 కెప్టెన్సీ నుండి తప్పుకుంటాను అని కోహ్లీ చెప్పి.. తప్పుకున్నాడు. కానీ ఆ తర్వాత వైట్ బాల్ ఫార్మటు లో ఇద్దరు కెప్టెన్లు వద్దు అని బీసీసీఐ కోహ్లీని వన్డే కెప్టెన్ గా తప్పించింది.
Advertisement
ఇక ఈ ఏడాది సౌత్ ఆఫ్రికాతో ముగిసిన టెస్ట్ సిరీస్ లో ఇండియా ఓడిపోయిన తర్వాత నేను ఈ లాంగ్ ఫార్మటు నుండి కూడా కెప్టెన్ గా తప్పుకుంటున్నాను అని కోహ్లీ పేర్కొన్నాడు. అయితే ఇక్కడే అభిమానులు బీసీసీఐని విమర్శించడం మొదలు పెట్టారు. బీసీసీఐ కావాలనే కోహ్లీని కెప్టెన్ గా తప్పించింది అని అన్నారు. దానికి బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ.. మేము కోహ్లీతో ఈ కెప్టెన్సీ విషయంలో మాట్లాడం అని పేర్కొన్నాడు. కానీ కోహ్లీ నాకు ఎవరు చెప్పలేదు అని అన్నాడు.
Advertisement
ఆ తర్వాత ఈ విషయంపై ఎవరు స్పందించలేదు. కానీ తాజాగా ఇప్పుడు మరోసారి బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధూమల్ కామెంట్స్ చేసాడు. ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్సీ నుండి తప్పుకోవాలని కోహ్లీనే కోరుకున్నాడు. కేవలం మేము అతని నిర్ణయానికి గౌరవం ఇచ్చాము అని ప్రకటించాడు. దాంతో ఇప్పుడు మళ్ళీ ఈ కోహ్లీ కెప్టెన్సీ తెరపైకి వచ్చింది.
ఇవి కూడా చదవండి :