Home » త‌రుణ్ తో ఆర్తీ పెళ్లి ఆగిపోవ‌డానికి కార‌ణం ఎవ‌రో తెలుసా..?

త‌రుణ్ తో ఆర్తీ పెళ్లి ఆగిపోవ‌డానికి కార‌ణం ఎవ‌రో తెలుసా..?

by AJAY
Ad

చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెర‌కు ప‌రిచ‌యమైన కుర్రాడు త‌రుణ్‌…క‌ట్ చేస్తే నువ్వే కావాలి సినిమాతో హీరోగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమాతోనే యూత్ అంద‌రినీ త‌న‌వైపు తిప్పుకున్నాడు. అప్ప‌ట్లో ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. అంతే కాకుండా త‌రుణ్ కు ఈ ఒక్క‌సినిమాతోనే ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ కూడా వ‌చ్చేసింది. త‌రుణ్ అందం..హుషారుగా న‌టించ‌డం అమ్మాయిల‌కు తెగ‌న‌చ్చేసింది. ఈ సినిమా క్రియేట్ చేసిన సంచ‌ల‌నాల‌తో ఇప్ప‌టికీ ఈ సినిమాను ప్రేక్ష‌కులు మ‌ర్చిపోలేదు. ఆ త‌ర‌వాత వ‌చ్చిన ప్రియ‌మైన నీకు సినిమా కూడా మంచి విజ‌యం సాధించడంతో టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా త‌రుణ్ ఎదిగాడు.

tharun arthi agarwal

tharun arthi agarwal

ఆ వెంట‌నే మాట‌ల మాత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నువ్వే నువ్వే కూడా మంచి విజ‌యం సాధించింది. దాంతో టాప్ హీరోల లిస్ట్ చేరిపోయి ఇండ‌స్ట్రీలో బిజీ హీరోగా మారిపోయాడు. అదే ఊపులో త‌రుణ్ నువ్వు లేక నేను లేను సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది. అయితే ఈ సినిమా విజ‌యం సాధించి పెట్ట‌డంతో పాటూ త‌రుణ్ వార్త‌ల్లోకి ఎక్క‌డానికి కూడా కార‌ణ‌మయ్యింది. దానికి కార‌ణం ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టించిన ఆర్తి అగర్వాల్ తో త‌రుణ్ ప్రేమ‌లో ఉన్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌ర‌గ‌ట‌మే. ఇక ఆ త‌ర‌వాత హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న వీరి సోగ్గాడు సినిమాలో మ‌ళ్లీ క‌లిసి రొమాన్స్ చేశారు. ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించ‌లేదు గానీ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ మాత్రం మ‌రింత బ‌ల‌ప‌డింద‌ట‌.

Advertisement

Advertisement

కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్ర‌చారం జరిగింది. అయితే వారి పెళ్లికి త‌రుణ్ త‌ల్లి రోజా ర‌మ‌ణి అడ్డుప‌డ్డార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆర్తీ మ‌నోవేద‌న‌కు గురైంద‌ట‌..అంతే కాదు అదే స‌మ‌యంలో ఆర్తీ ఆత్మ‌హ‌త్య‌కు కూడా ప్ర‌య‌త్నించింది. కానీ కొంత కాలం త‌ర‌వాత అందులో నుండి బ‌య‌ట‌ప‌డి అమెరికాకు చెందిన ఎన్నారైను వివాహం చేసుకుంది. కానీ వైవాహిక జీవితంలోనూ తాను సంతోషంగా లేక భ‌ర్త‌కు విడాకులు ఇచ్చి మ‌ళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రీఎంట్రీలో అనుకున్న‌మేర విజ‌యాలు రాక‌పోయినా అడ‌పాద‌డ‌పా సినిమాలు చేసింది. ఈ క్ర‌మంలో కాస్త లావు అవ్వ‌డంతో స‌న్న‌గా అయ్యేందుకు శ‌స్త్ర చికిత్స చేసుకుంది. ఆ శ‌స్త్ర చికిత్సే ఆమె పాలిట శాప‌మై ప్రాణాలు తీసింది.

Also read: రాధిక మూడు పెళ్లిళ్లు చేసుకోవ‌డానికి కార‌ణ‌మేంటో తెలుసా..?

Visitors Are Also Reading