స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప. ఈసినిమా డిసెంబర్ 17 థియేటర్లలో విడుదలగా మిశ్రమ స్పందన వస్తోంది. ఈ చిత్రం గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమా షూటింగ్ ఎక్కవ భాగాన్ని ఏపీలోని శేషాచలం అడవుల్లో మారేడ్ మిల్లి ప్రాంతంలో చిత్రించారు. ఇక ఈ సినిమాలో గ్రాఫిక్స్ కంటే ఎక్కువగా నాచురల్ గా సెట్లు వేసి చిత్రీకరించారు. ఈ సినిమాకు రామకృష్ణ ఆయన సతీమణి మౌనికలు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాకు కూడా రామకృష్ణ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు.
ఈ సినిమలో ఆర్ట్ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అదే రేంజ్ లో రామకృష్ణ మౌనిక దంపతులు పుష్ప కోసం కష్టపడ్డారు. వారి కష్టం సినిమాలో కనిపిస్తుంది. ఇక తాజాగా వారిద్దరూ పుష్ఫ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని అనుభవాలను షేర్ చేసుకున్నారు. పుష్ఫ సినిమా షూటింగ్ జరిగిన ప్రదేశంలో నిజానికి అసలు ఎర్రచందనం చెట్లే లేవు. అయితే మొదట షూటింగ్ కోసం రెండు లారీల ఎర్రచందనం దుంగలను లారీలో తెప్పించారట.
Advertisement
Advertisement
కానీ ఆ ఎర్రచెందనం దుంగలు సరిపోవని కనీసం యాబై లారీల ఎర్ర చందనం దుంగలు కావాలని సుకుమార్ చెప్పారట. కానీ షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి యాబైలారీల ఎర్రచెందనం అంటే కనీసం పదివేల ఎర్రచందనం దుంగలు కావాలి వాటికి భారీ ఖర్చు అవుతుంది. అంతే కాకుండా ఆ దుంగలను కొండపైకి తెప్పిచడం చాలా కష్టమైన పని దాంతో తామే ఎర్రచందనం దుంగలను తెప్పించకుండా ఆర్ట్ వర్క్ తో సృష్టించారట. దాంతో ఈ జంట మైత్రీకి చాలా వరకూ బడ్జెన్ ను సేవ్ చేశారు. అంతేకాకుండా సినిమాలో కనిపించే రాళ్లలో కూడా కొన్నింటిని తామే సృష్టించామని రామకృష్ణ చెబుతున్నారు.
also read : షాకింగ్… డ్రంక్ అండ్ డైవ్ లో పట్టుబడ్ట జబర్దస్త్ వర్ష ఇమాన్యుయేల్..!