భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పైన ఏ విధమైన ట్రోల్స్ అనేవి జరుగుతున్నాయో అందరికి తెలిసిందే. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సింపుల్ క్యాచ్ వదిలేయడంతోనే అతనిపైన ఈ విధమైన ట్రోలింగ్ అనేది జరుగుతుంది. అతను ఇండియన్ కాదు అని.. ఖలిస్తానికి చెందిన వాడు అంటూ వికీపీడియాలో ఎడిటింగ్ కూడా చేసారు కొందరు. అయితే ఈ ట్రోలింగ్ పైన అర్ష్‌దీప్ సింగ్ చాలా వింతగా స్పందించినట్లు తెలుస్తుంది.
Advertisement
అర్ష్‌దీప్ సింగ్ యొక్క అమ్మ, నాన్న తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. అందులో అర్ష్‌దీప్ సింగ్ ట్రోలింగ్ పై ఏ విధమైన కామెంట్స్ చేసారో పేర్కొన్నారు. అర్ష్‌దీప్ సింగ్.. మాకు ఫోన్ చేసి మొదట ఈ ట్రోలింగ్ ను పట్టించుకోకండి అని తమకు చెప్పినట్లు పేర్కొన్నారు. అలాగే ఈ ట్రోలింగ్ చూస్తుంటే భాధ కాకుండా.. తనకు నవ్వు అనేది ఎక్కువ వస్తుంది అని తమ కొడుకు చెప్పినట్లు వారు పేర్కొన్నారు.
Advertisement
అలాగే ఈ విషయంలో మొత్తం భారత జట్టు తనకు మద్దతుగా ఉందని అర్ష్‌దీప్ సింగ్ పేర్కొన్నట్లు వారు చెప్పుకొచ్చారు. ఇక మేము కూడా ఈ విషయంలో ఎక్కువగా ఆలోచించడం లేదు అని.. ఇక ఆట అన్నపుడు అందులో ఎవరో ఒక్కరే గెలుస్తారు అని అర్ష్‌దీప్ సింగ్ అమ్మ, నాన్న కామెంట్స్ చేసారు. ఇక నీకం చెప్పాలి అంటే అర్ష్‌దీప్ సింగ్ ఆ క్యాచ్ గనుక మిస్ చేయకుండా ఉండి ఉంటె విజయం భారత్ దే అనే విషయం అందరికి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :