Home » సార్ నా భార్యను అరెస్ట్ చేయండి.. పోలీస్ స్టేషన్ ముందు నిరసన.. కారణం ఏమిటంటే?

సార్ నా భార్యను అరెస్ట్ చేయండి.. పోలీస్ స్టేషన్ ముందు నిరసన.. కారణం ఏమిటంటే?

by Anji
Ad
భార్య భర్తలు అన్నప్పుడు సాధారణంగా గొడవలు కామన్. అతిగా ప్రవర్తిస్తుంటారు. కొందరికి మద్యం తాగుడు అలవాటు ఉంటుంది. పెళ్లి జరిగిన తర్వాత దీనిని అనుకుంటారు.  మరికొందరు మాత్రం సంపాదన అంతా తాగుడు కే  పెడుతుంటారు. దీనికి భార్యలు అడ్డుతగిలితే వారిపై కూడా దాడి చేస్తారు. భార్య దాచుకున్న సొమ్మును కూడా తాగుడు కోసం ఖర్చు చేస్తుంటారు. చాలామంది మద్యానికి బానిస కావడం వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డున రోడ్డున వాడిన ఘటనలను ఎన్నో చూస్తుంటాం. కొంతమంది భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నారు కూడా. ఇలాంటి ఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తమిళనాడులో స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వింత ఘటన జరిగింది. విల్లుపురం లోని జయం అనే గ్రామంలో ఉదంతం చోటుచేసుకుంది. నటరాజన్ అనే వ్యక్తి రోజు తాగేవాడు. నటరాజన్ నిత్యం తాగడం వల్ల భార్యాభర్తలకు గొడవలు జరిగేవి. రోజులపాటు భార్య ఓపిక పట్టింది. రోజు మాదిరిగానే 13న కూడా నటరాజన్ తాగి రాత్రి ఇంటికి వెళ్ళాడు. రోజు మాదిరిగానే భార్యతో గొడవ పెట్టుకున్నాడు. అప్పటికే కోపంగా ఉన్న భార్య.. సలసల కాగుతున్న రసాన్ని మొగుడి మీద విసిరి కొట్టింది.
దీంతో అతడు బయటకు పరుగులు పెట్టాడు. తాగిన మత్తులో ఏకంగా పోలీస్స్టేషన్ వద్దకు వెళ్ళాడు. నా భార్య ను అరెస్టు చేయాలని కోరాడు. ఫిదా ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని పోలీసులు అతనికి సూచించారు. పట్టించుకోకపోవడంతో అతను హిందీ గానం కృష్ణగిరి చౌరస్తా వద్దకు చేరుకున్నాడు. కూడా భార్య మీద చర్యలు తీసుకోవాలి అని గట్టిగా అరిచాడు. రోడ్డు మీద అతని న్యూసెన్స్ చూసి పోలీసులే ఆస్పత్రికి తరలించారు. మత్తు దిగిన తర్వాత అతను ఇంటికి వెళ్ళాడు. అతను లిఖిత పూర్వకమైన ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు కేసు నమోదు చేయలేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Visitors Are Also Reading