Home » అర్జున ఫాల్గుణ ట్రైల‌ర్ విడుద‌ల‌..అద‌ర‌గొట్టిన శ్రీవిష్ణు..!

అర్జున ఫాల్గుణ ట్రైల‌ర్ విడుద‌ల‌..అద‌ర‌గొట్టిన శ్రీవిష్ణు..!

by AJAY
Ad

విభిన్న చిత్రాల‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచే హీరో శ్రీ విష్ణు. ఇప్ప‌టి వ‌ర‌కూ డిఫ‌రెంట్ చిత్రాల‌తో ఆడియ‌న్స్ ముందుకు వ‌చ్చిన ఈ యంగ్ హీరో ఇప్పుడు మ‌రో విభిన్న క‌థాంశంతో అర్షుణ ఫాల్గుణ అనే స‌రికొత్త టైటిల్ తో ముందుకు వ‌స్తున్నాడు. ఈ చిత్రానికి తేజ మ‌ర్ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ్యాట్ని ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై నిరంజ‌న్ రెడ్డి అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడిగా అమృతా అయ్య‌ర్ న‌టించారు.

arjuna falguna trailer out

arjuna falguna trailer out

అదే విధంగా ప్రియ‌ద‌ర్శ‌న్ బాల‌సుబ్ర‌మ‌ణ్య‌న్ ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ట్రైల‌ర్ ఎంతో ఆక‌ట్టుకునే విధంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కింది. శ్రీవిష్ణు ట్రైల‌ర్ లో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఈ సినిమా నిర్మాణ విలువ‌కు కూడా భాగున‌ట్టు అర్థం అవుతోంది. అంతే కాకుండా డిగ్రీ పూర్తిచేసిన త‌ర‌వాత గ్రామంలో జులాయి గా తిరిగే విద్యార్థి జీవితం ఎలా ఉంటుంది.

Advertisement

Advertisement

అనుకోని సంఘ‌ట‌న లు జీవితంలో ఎదుర‌వ్వ‌డం వ‌ల్ల వాటిని ఎలా ఎదుర్కొంటాడు అన్న‌ది ఈ చిత్రంలో చూపించ‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అంతే కాకుండా ఊర్లో ఇద్ద‌రి యువ‌తి యువ‌కుల ప్రేమ ఏవిధంగా ఉంటుంద‌నేది కూడా సినిమాలో చూపించ‌బోతున్న‌ట్టు క‌నిపిస్తుంది. ఇక ట్రైల‌ర్ లో కామెడీ, యాక్ష‌న్ సీన్లతో పాటు ఎమోష‌న‌ల్ సీన్లు ఆక‌ట్టుకున్నాయి. మరి అర్జున ఫాల్గుణ సినిమా శ్రీవిష్ణుకు ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి.

Visitors Are Also Reading