ఇండస్ట్రీ హిట్ అంటే హీరోలకు వారి అభిమానులకు ఒక ఎమోషన్. ఆ పదాన్ని వారు ప్రెస్టెజస్‌గా తీసుకుంటారు. మన తెలుగులో అందరూ ఆక్సెప్ట్ చేస్తే అలాంటి ఇండస్ట్రీ హౌస్ చాలానే ఉన్నాయి. కానీ వాటితో పాటు కొన్ని వివాదస్పద ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అవి ఇండస్ట్రీ హిట్స్ కాదా అని కొన్ని దశాబ్దాలుగా అభిమానులు కొట్టుకుంటూనే ఉన్నారు. సోషల్ మీడియా వచ్చాక అది ఇంకా పెరిగి పెద్దదైపోతుంది. మా మూవీ ఇండస్ట్రీ హిట్ అని ఫ్యాన్స్.. కాదు అని మిగిలిన ఫ్యాన్స్ ఎవరిసోర్స్‌తో వారు బిహేవ్ చేస్తూనే ఉన్నారు. అలాంటి 6 కాంట్రవర్షిలను ఇండస్ట్రీ హిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఖైదీ
1983లో విడుదల అయి సెన్సేషనల్ హిట్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఖైది ఇండస్ట్రీ హిట్ అని చిరు ఫ్యాన్స్ అంటారు. కానీ అంతకు ముందు ప్రేమాభిషేకం, కొండవీటి సింహం సినిమాలను ఖైది క్రాస్ చేయలేదని మిగిలిన ఫ్యాన్స్ పేర్కొంటారు. అదే సంవత్సరం విడుదలైన ముందడుగు చిత్రం 1983లో హయ్యస్ట్ క్రాసింగ్ మూవీ అనేది మరొక వాదన.
నిన్నే పెళ్లాడతా
1996లో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం నిన్నే పెళ్లాడతా. దీనిని ఇండస్ట్రీ హిట్‌గా నాగ్ అభిమానులు చెప్పుకుంటారు. అయితే అంతకు ముందటి పెద్దరాయుడు సినిమా ఈ మూవీ అధికమించలేదని మిగతా ఫ్యాన్స్ వాదిస్తారు. ఈ వివాదం 1996 నుంచి కొనసాగుతూనే ఉంది.
కలిసుందాంరా..!
గ్రాస్ పరంగా కలిసుందాంరా అప్పటికీ టాప్ మూవీ అందులో డౌట్ లేదు. అయితే షేర్ పరంగా సమరసింహారెడ్డి మూవిని క్రాస్ చేయలేదని ఫ్యాన్స్ చెబుతారు. అయినా వెంకీ ఫ్యాన్స్ 2000లో విడుదలైన కలిసుందాంరా ఇండస్ట్రీ హిట్ గానే పరిగణిస్తున్నారు.
Advertisement
ఖుషి
2001లో విడుదలైన సెన్సేషనల్ హిట్ అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ ఖుషి. ఇది ఇండస్ట్రీ హిట్ అని పవన్ ఫ్యాన్స్. కాదు అని నరసింహానాయుడుని క్రాస్ చేయలేదని బాలయ్య అభిమానులు ఎప్పటి నుంచో ఆర్గ్యూమెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఖుషి వర్సెస్ నరసింహానాయుడు బాగా ఫేమస్.
సింహాద్రి
2003లో బాక్సాఫీస్‌ను గడగడలాడించిన సింహాద్రి ఇంతకు ముందు ఇండస్ట్రీ మిట్ ఇంద్రను క్రాస్ చేసిందా లేదా అనేదాని మీద పెద్ద రచ్చే జరిగింది. ఇప్పటికీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెగాఫ్యాన్స్ వేదికగా సింహాద్రి డిబెట్ జరుగుతూనే ఉంది.
దూకుడు
2011లో బ్లాక్ బస్టర్ అయిన దూకుడు ఇండస్ట్రీ హిట్ అని స్వయానా నిర్మాతలే స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే మగధీరను క్రాస్ చేయకుండా దూకుడు ఇండస్ట్రీ హిట్ ఎలా అవుతుందని మెగాఫ్యాన్స్ వాదన. మహేష్ అభిమానులు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా మగధీరను క్రాస్ చేసింది దూకుడు ఇండస్ట్రీ హిట్ అని బలంగా వాదిస్తారు. ఇందులో వాస్తవాల జోలికి పోకుండా కేవలం అందులోని కాంట్రవర్స్‌ని మాత్రమే ప్రస్తావించినట్టు గమనించగలరు.
ఇవి కూడా చదవండి :
- కెజియఫ్ 2 తర్వాత ఆర్ఆర్ఆర్ విడుదలై ఉంటె ఏం జరిగేది..?
- సింహాసనం సినిమాలో ‘ఆకాశంలో ఒక తార’ పాట పాడిన సింగర్ ఇండస్ట్రీ లో ఎదగకుండా తొక్కేసారా?
- పూజకు ఉపయోగించిన పూలను ఏం చేయాలో తెలుసా..?