Home » గురక సమస్యతో బాధపడుతున్నారా ? ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే ఫలితం పక్కా..!

గురక సమస్యతో బాధపడుతున్నారా ? ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే ఫలితం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా  చాలా మందికి బిగ్గరగా గురక పెట్టే అలవాటు ఉంటుంది. దీంతో మన తోటి వారు నిద్రపోయే వారి నిద్రకు భంగం కలుగుతుంది.  గురక రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. నిద్రపోయేటప్పుడు శ్వాసనాళానికి అంతరాయం కలిగితే శరీరంలోని అంతర్గత కణాల ప్రకంపనల కారణంగా అవాంఛిత శబ్దం వస్తుంది. కొంతమంది అలసట లేదా ఒత్తిడి కారణంగా కూడా గురక పెడతారు. ఇది కాకుండ.. కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా గురకకు కారణమవుతాయి. కాబట్టి దీన్ని విస్మరించకూడదు. గురకను దూరం చేసుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఏంటో ఇప్పుడు మనం  తెలుసుకుందాం.

Advertisement

ఆలివ్ ఆయిల్ : 

ఇదిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్ సమస్యను తొలగించడంలో సహాయపడతాయి. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆలివ్ ఆయిల్ గురకను తొలగించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ముక్కులో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ రాసుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది.

Advertisement

వెల్లుల్లి :

సైనస్ కూడా గురకకు కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో, వెల్లుల్లి ప్రయోజనకరంగా ఉంటుంది. వెల్లుల్లి మొగ్గలను వేయించి రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో తీసుకుంటే గురక సమస్య తొలగిపోతుంది.

తేనే: 

గురక సమస్యను తొలగించడానికి తేనె కూడా చాలా ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు శ్వాస సమస్యను దూరం చేస్తాయి. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి రాత్రి పడుకునే ముందు తాగితే త్వరగా ఉపశమనం లభిస్తుంది.

పసుపు : 

పసుపు గురకను వదిలించుకోవడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగితే గురక సమస్య తొలగిపోయి నిద్ర కూడా నయమవుతుంది.

 

Visitors Are Also Reading