Home » అతిగా నిద్రపోతున్నారా… అయితే ప్రమాదమే.. ఏంటో చూడండి..!!

అతిగా నిద్రపోతున్నారా… అయితే ప్రమాదమే.. ఏంటో చూడండి..!!

by Sravanthi
Ad

మానవ శరీరం అంటేనే ఒక యంత్రంతో సమానం. ఏదైనా వాహనంలో మనం పెట్రోల్ లేదా డీజిల్ పోస్తేనే అది కదులుతుంది. అలాగే ఆ వాహనంలో ఏ పార్టులో సమస్య వచ్చినా అగిపోతుంది. అలాగే మానవ శరీరం కూడా అంతే ఏ చిన్న సమస్య వచ్చినా మన శరీరం సహకరించదు. ఎక్కువ తిన్న ఇబ్బందే, తక్కువ తిన్నా ఇబ్బందే. మన శరీరానికి ఎంత అయితే సరి పడుతుందో మనకు తెలుస్తుంది అంతే మనం శరీరానికి తీసుకోవాలి తప్ప అతి ఎప్పుడూ పనికిరాదు..? ఇందులో ముఖ్యంగా అతి నిద్ర చాలా ప్రమాదం.. అలాగే తక్కువ నిద్ర కూడా ప్రమాదానికి దారి తీస్తుంది.. మరి ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసుకుందామా..?

సాధారణంగా మనిషి 24 గంటలు నిద్రపోవడం అస్సలు కుదరదు. నిద్రపోయేటప్పుడు మన మెదడులో రేటిక్కులర్ యాక్టివేటింగ్ సిస్టం ఒకటి ఉంటుంది. ఈ వ్యవస్థ నిద్రలోకి జారుకున్నా మెదడుని ఉత్తేజపరిచి నిద్ర నుంచి మేల్కొలుపుతుంది. ఒక ప్రయోగం ప్రకారం కొన్ని ఎలుకలపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. నిద్రలోకి జారుకున్న ప్రతిసారి వాటిని నిద్ర లేపారు దీంతో కొన్ని రోజులకు ఎన్నికలు వాటి మెదడులో రక్తస్రావంతో మృతి చెందాయి. అలాగే సిడ్నీలో 60-70వ దశకంలో పేరుగాంచిన మానసిక వైద్యులు తీవ్రమైన మానసిక వ్యాధులు ఉన్నటువంటి కొంతమంది రోగుల్ని కొన్ని రోజులపాటుగా పూర్తి మత్తు ఇచ్చి నిద్రలోకి దించారు. దీంతో కొంత మంది రోగులు మృతి చెందారు.

Advertisement

Advertisement

మరికొంతమంది రోగులు తీవ్రమైన దుష్ఫలితాలు ఎదుర్కొన్నారు. అలాగే అమెరికాలో ప్రసవ సమయంలో ఉన్న తల్లులు నొప్పుల బాధ నుంచి బయటకు రావడానికి వారికి కూడా మత్తు ఇచ్చి రెండు నుంచి మూడు రోజులపాటు నిద్రలోకి దించడం వలన వారు ఆ మత్తు నుంచి తేరుకున్నాక అయోమయానికి గురికావడం, వారి పిల్లల్ని గుర్తించకపోవడం మొదలైన దుష్పరిమాణాలు జరిగాయి. అయితే సాధారణంగా మనం రోజుకు గంటకి అటుఇటుగా ఎనిమిది గంటలు నిద్రపోతే మెదడు విశ్రాంతి తీసుకుంటుందని, మెదడులో ఉన్న వ్యర్థాలు బయటకు పోయి మరుసటి రోజుకు కావలసిన శక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

ALSO READ:

Maria Sharapova : త‌ల్లికాబోతున్న మాజీ టెన్నిస్ క్రీడాకారిణి.. పుట్టిన‌రోజు నాడు ప్ర‌క‌ట‌న‌

అప్పట్లోనే వచ్చిన ఈ 10 సినిమాలను పాన్ ఇండియా లెవెల్లో తీసుంటే… బ్లాక్ బస్టరే..?

 

Visitors Are Also Reading