ఇప్పటికే ఎండలు భగభగ మండిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంది. ఈ తరుణంలో చాలామంది చల్లదనం కోసం జ్యూస్లు,ఇతర చల్లని పదార్థాలు తింటూ ఉంటారు. అంతేకాకుండా కీరదోస కూడా మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులో ఉండే వాటర్ కంటెంట్ వల్ల శరీరం డీ హైడ్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య నిపుణులు కీరదోస తినాలని చెబుతూ ఉంటారు.. మరి కీరదోస వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
also read:Sr:NTRకు ‘బ్రదర్’ అనే మాట నేర్పింది ఎవరో తెలుసా..?
Advertisement
also read:ఆ సినిమాలో మమతామోహన్ దాస్ కనిపించకపోవడానికి నయనతారనే కారణమా..?
Advertisement
కీరదోసలో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరిచి, మలబద్దక సమస్య రాకుండా చేస్తుంది.అలాగే మన శరీరంలో పేరుకుపోయిన ట్యాక్సీన్లను బయటకు పంపుతుంది. ఇందులో ఉండే విటమిన్ కే రోగనిరోధ శక్తిని పెంపొందించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎముకల బలత్వానికి చాలా యూజ్ అవుతుంది. కీరదోస లో ఫినోరేసినాల్, లారీసేరిసినల్ వంటివి ప్రోస్టేట్ క్యాన్సర్లు నివారించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కీరదోస లో ఉండే విటమిన్లు బ్లడ్ ప్రెజర్, రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరిగేలా చేస్తుంది.
దీనిలో ఉండేటువంటి విటమిన్ బి తలనొప్పిని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా ప్రేరేపిస్తుంది.కీరదోస ని జ్యూస్ చేసుకొని తాగడం వల్ల కడుపులో పుండ్లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో కీరదోస తీసుకోవడం వల్ల దాహం తక్కువగా వేస్తుంది. అంతేకాదు ముక్కలుగా చేసి కళ్ళపై ఉంచుకోవడం వల్ల మంటలు, ఎరుపులు తగ్గి చాలా చల్లదనాన్ని ఇస్తుంది.
also read:కృతిశెట్టి ధరించిన శారీ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!