Home » కృతిశెట్టి ధరించిన శారీ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

కృతిశెట్టి ధరించిన శారీ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ లలో అందాల భామ కృతిశెట్టి ఒకరు. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించినటువంటి ఉప్పెన చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది మంగుళూరు బ్యూటీ. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్ముడికి వరుస ఆఫర్లు వచ్చాయి. ఉప్పెన సినిమా తరువాత నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా చేసింది. 

Also Read :  ఆ సినిమాలో మమతామోహన్ దాస్ కనిపించకపోవడానికి నయనతారనే కారణమా..?

Advertisement

మొదటి సినిమాలో పద్దతిగా కనిపించిన ఈ చిత్రంలో మాత్రం రెచ్చిపోయింది. ఏకంగా లిప్ లాక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్యామ్ సింగరాయ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. నాగచైతన్య, నాగార్జున కలిసి నటించిన బంగార్రాజు చిత్రంలో నాగచైతన్యకి జోడీగా నటించింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ గానే నిలిచింది. ఇలా వరుస విజయాలను అందుకొని స్టార్ గా మారిపోయింది. ఆ తరువాత ఈ అమ్ముడికి బ్యాడ్ సమయమే స్టార్ట్ అయింది. చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన వారియర్ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. 

Advertisement

Also Read :  బాహుబ‌లి సినిమాలో త‌మ‌న్నా రోల్… మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్‌..!

ఇక ఆ తరువాత వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా చేసింది. ఈ చిత్రం కూడా ఫ్లాప్ అయింది. వెంటనే నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గంలో కూడా నటించింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్కటే సినిమా ఉంది. నాగచైతన్య నటిస్తునన కస్టడీ చిత్రంలో హీరోయిన్ గా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు కట్టుకున్న శారీ ఇప్పుడు సెన్షేషనల్ గా మారింది. ఈమె అదిరిపోయే శారీలో దర్శనమిచ్చింది. ఆ శారీ పేరు సావన్ గాంధీ-ఐవరీ ముకిష్ వర్క్ శారీ. ఏకంగా దాని ధర రూ.99,000 అని తెలుస్తోంది. ఈ బేబమ్మ శారీ ధర తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 

Also Read :  Rana Naidu : ‘రానా నాయుడు’ తెలుగు రివ్యూ… దుమ్ము లేపిన రానా, వెంకీ

Visitors Are Also Reading