Home » ఆ సినిమాలో మమతామోహన్ దాస్ కనిపించకపోవడానికి నయనతారనే కారణమా..?

ఆ సినిమాలో మమతామోహన్ దాస్ కనిపించకపోవడానికి నయనతారనే కారణమా..?

by Anji
Ad

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించి ఈ మధ్య కాలంలో కనుమరుగైన వారిలో మమతా మోహన్ దాస్ ఒకరు. రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ చిత్రంతో ఈమె టాలీవుడ్ కి పరిచయమయ్యారు మమతా. ఇక ఆ తరువాత పలు సినిమాలలో హీరోయిన్ గా చేసారు. కేవలం నటిగానే కాకుండా సింగర్ గానే తన ప్రతిభ చాటుకున్నారు. ఈ బ్యూటీ క్యాన్సర్ భారిన పడిన విషయం విధితమే. 

Also Read :  CHIRANJEEVI : మెగాస్టార్ తన ఫోన్ లో సురేఖ, పవన్, చరణ్ పేర్లను ఏమని సేవ్ చేసుకున్నారో తెలుసా ?

Advertisement

చాలా ధైర్యంతో ఆ మహమ్మారితో పోరాడి కాన్సర్ ని జయించింది మమతా మోహన్ దాస్. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోయిన్ నయనతారపై పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేసింది మమతా. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఓ సినిమా తనకు ఛాన్స్ దక్కిందని తెలిపారు. ఆ సినిమాలోని ఓ పాట కోసం షూటింగ్ కూడా చేశారట. దాదాపు నాలుగు రోజుల పాటు తనపై సాంగ్ ని షూట్ చేసారట. 

Advertisement

Also Read :  “ఆదిత్య 369” టైటిల్ లో 369 నంబ‌ర్ ఎందుకు పెట్టారో తెలుసా..? ఆ నంబ‌ర్ అర్థం ఏంటంటే..?

షూట్ చేస్తున్న సమయంలో ఆ ఫ్రెమ్ లో నేను లేను అని అర్థం అయింది. కేవలం ఒక్క షాట్ లో వెనుక నుంచి కనిపించా అని పేర్కొన్నారు. నాకు చెప్పిన విధంగా సాంగ్ షూట్ జరుగలేదని ఆమె తెలిపారు. ఎవరు అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించారో ఆమె వల్ల ఈవిధంగా జరిగిందని తెలిపారు మమత. వేరే హీరోయిన్ షూటింగ్ లో ఉంటే నేను రాను అని హీరోయిన్ చెప్పడంతో ఇలా జరిగిందని పేర్కొన్నారు. మమతా చెప్పిన రజినీకాంత్ సినిమా కథానాయకుడు. ఆ చిత్రంలో హీరోయిన్ గా చేసింది నయనతార. ఇలా హీరోయిన్ పేరు చెప్పకుండా నయన్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది మమతా. 

Also Read :  Rana Naidu : ‘రానా నాయుడు’ తెలుగు రివ్యూ… దుమ్ము లేపిన రానా, వెంకీ

Visitors Are Also Reading