వేరు శనగలు అత్యంత ముఖ్యమైన ఆరోగ్యకరమైన పప్పు ధాన్యాల్లో ఒకటి. ఈ వేరు శనగలు ఎన్నో పోషక విలువలు కలిగిన మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. సాధారణంగా వర్షాకాలంలో వేరు శనగ గురించి తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. ఎక్కువగా వేయించిన వేరు శనగ పప్పు తినడం వల్ల అజీర్తి, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కానీ ఉడికించిన వేరు శనగలు తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
ఇవి కూడా చదవండి : మష్రూమ్స్ ఎక్కువగా తింటున్నారా..? ఈ విషయాలు మీరు తప్పక తెలుసుకోండి..!
Advertisement
వేరు శనగలో కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, ఐరన్, విటమిన్ బి, విటమిన్ ఈ, నియాసిన్, ఫైబర్, అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, ప్రోటిన్, మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ వంటి పోషకాలు ఎన్నో పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు నానబెట్టిన వేరు శనగ విత్తనాలు తినడం వల్ల ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు దరి చేరవు. నానబెట్టిన వేరుశనగ విత్తనాలు తినడం వల్ల క్యాన్సర్ సమస్యలను కూడా అదుపులో ఉంచవచ్చు. ఉడికించిన వేరు శనగలను గర్భీణీలు తింటే ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభించి కడుపులోని శిశువు ఎదుగుదల మెరుగ్గా మారుతుంది. ఒత్తిడిగా ఉన్న సమయంలో ఒకే ఒక కప్పు ఉడికించిన వేరు శనగలను తీసుకోవాలి. ఒత్తిడి చిత్తు చిత్తు అవ్వడంతో పాటు తలనొప్పి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు సైతం తగ్గుతాయి.
Advertisement
ముఖ్యంగా సంతాన లేమితో బాధపడే దంపతులు ఉడికించిన వేరు శనగలను రోజూ తింటే లైంగిక సమస్యలు తగ్గుముఖం పట్టి సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. ప్రతిరోజు ఉదయం నానపెట్టిన వేరుశనగ విత్తనాలు తినడం ద్వారా శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగి గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. చిన్నపిల్లలు, గర్భవతులు వేరు శనగ విత్తనాలు, బెల్లం కలిపిన పల్లి చెక్క తినడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటిపడవచ్చు. అదేవిధంగా ఉడికించిన శనగలను తినడం ద్వారా హెయిర్ ఫాల్ సమస్యకి అడ్డు కట్ట వేయవచ్చు. ముఖ్యంగా శరీర బరువు అదుపు తప్పకుండా ఉంటుంది. దంతాలు, ఎముకలు, కండరాలు దృఢంగా మారుతాయి.
ఇవి కూడా చదవండి : మీ గొంతులో కఫం పేరుకుపోయిందా..? అయితే ఈ చిట్కాతో అద్భుతమైన ఫలితం..!