Home » పరిగడుపున టీ తాగుతున్నారా.. అయితే ప్రమాదమే..?

పరిగడుపున టీ తాగుతున్నారా.. అయితే ప్రమాదమే..?

by Sravanthi
Ad

చాలామంది జనాలకు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు ఉంటుంది. మరికొంతమంది అయితే ఉదయం లేవగానే టీ తాగకపోతే వారి రోజు మొదలవదు అని చెబుతారు. ఇలా చాలామంది జనాలు టీ కి దాసోహం అయిపోతారు. టీ తాగకపోతే వారికి ఏదీ తోచదు. మరికొంతమందికి బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత టీ తాగడం అలవాటు ఉంటుంది. అయితే ఇలాంటి అలవాటు ఉంటే గనుక చాలా సమస్యలు ఎదుర్కోక తప్పదు అని చెబుతున్నారు మన వైద్య నిపుణులు.

Advertisement

also read:సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ని కాదని నరేష్ తో ఉండటానికి కారణం ఏంటో తెలుసా ?

ఉదయం పూటనే కెఫిన్ వంటి పానీయాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. పొద్దున్నే టీ తాగే వారికి ఎసిడిటీ వచ్చే సమస్య చాలా ఉందని చెబుతున్నారు. ఉదయం తాగే టి మీ ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రభావం చూపిస్తుంది. చాలామంది టీ తాగడం వల్ల బ్రెయిన్ యాక్టివ్ గా పని చేస్తుందని భావిస్తారు. అయితే టీలో ఉండే కెఫిన్ పదార్థం వల్ల మైండ్ ఫ్రెష్ నెస్ అనే భావన మనలో కనిపిస్తుంది. కానీ ఉదయం నిద్ర లేవగానే టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మాత్రం అస్సలు మంచిది కాదు. దీనికి బదులుగా ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసుడు వేడి నీళ్లు తీసుకోవడం చాలా మంచిది. వేడి నీళ్లు తాగడం వల్ల మన జీర్ణ వ్యవస్థ పనితీరు చాలా బాగుంటుంది. ఇక మరి కొంతమంది అయితే పళ్ళు తోముకోకుండానే లేవడంతోనే టీ తాగుతారు.

Advertisement

ఇలా చేయడం వల్ల నోట్లోని చెడు బ్యాక్టీరియా పేగుల్లోకి వెళ్లి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అది మీ పేగుల్లో మంచి బ్యాక్టీరియా తో కలిసి అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. టీ లో ఉండే థియోఫిలిన్ అనే అనే రసాయనం మీలో మలబద్ధకం రావడానికి కారణం అవుతుంది. ఉదయాన్నే ఒక కప్పు టీ తాగితే మీరు ఎలాంటి డైట్ ఫాలో అయిన దానికి ఫలితం ఉండదు. అందుకే ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగకూడదు అని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

also read:

Visitors Are Also Reading