పండుగల సమయంలో ఇంటిని శుభ్రం చేయడం పెద్ద ఛాలెంజ్ అనే చెప్పవచ్చు. ఇంటిని శుభ్రపరిచే సమయంలో బల్లులు బయటికి రాకుండా చేయడం పెద్ద సవాలు. బల్లులు చిన్నగా కనిపించవచ్చు. కానీ అవి మంచి భావాలను దెబ్బతీస్తాయి. దానిని పట్టుకోవడం యుద్ధంలో గెలిచిన దాని కంటే తక్కువ కాదు. ఇంట్లో ఎన్ని అలంకరణలు చేసినా బల్లి కనపడినట్టయితే మాత్రం కొంత మందికి నచ్చకపోవచ్చు. ముఖ్యంగా క్లీనింగ్ సమయంలో కొన్ని ఏర్పాట్లు చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఈ హోం రెమెడీస్ సులభమే కాదు.. చాలా ఎఫెక్టివ్ కూడా ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
Advertisement
బల్లులను వదిలించుకోవడానికి వెల్లుల్లి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెల్లుల్లి తొక్క తీసిన తరువాత మిగిలిపోయిన తొక్కలను పారేసే బదులు, వాటిని కుండలో ఉంచి, అందులో కొంచెం నీరు పోయాలి. తరువాత ఒక పాత్రలో రెండు పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్కను దంచి నానబెట్టిన వెల్లుల్లి పాయల నీళ్లలో దంచిన పేస్ట్‌ని కలిపి 30 నిమిషాలు అదేవిధంగా ఉంచాలి. ఇప్పుడు దానిని ఫిల్టర్ చేసి మీరు స్ప్రే చేయగల సీసాలో నింపండి. మీ ఇంట్లో బల్లులు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో ఈ ద్రావణాన్ని పిచికారీ చేయండి. మీరు కొన్ని రోజుల్లో ఈ స్ప్రే ప్రభావాన్ని చూడడం ప్రారంభిస్తారు. వీలు అయితే వారానికి ఒకటి లేదా రెండుసార్లు పిచికారీ చేయండి.
Advertisement
Also Read : నిత్యం ఈ 5 రకాల పండ్లను తీసుకుంటే మీ కొవ్వు కరిగిపోవడం పక్కా..!
మీరు బల్లులను వదిలించుకోవడానికి నాప్తలిన్ మాత్రలను కూడా ఉపయోగించవచ్చు. మీ ఇంట్లో ఏ మూలకు బల్లులకు ఎక్కువగా వస్తాయో, అక్కడ మూత్రలు ఉంచండి. అసలే బల్లికి దాని వాసన నచ్చదు. ఆ మూల నుంచి పారిపోతాయి. నెమలి ఈకలను ఉంచినా, గుత్తులు చేసి నెమలి ఈకలను ఉంచే ప్రాంతంలో బల్లి రాదు. దీనిని జాగ్రత్తగా చూసుకొండి. ఇంట్లోకి బల్లి రాకుండా ఉండాలంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నిజానికి, బల్లులు కీటకాలు, సాలె పురుగుల కోసం మాత్రమే ఇళ్లకు వస్తాయి. ఈ సందర్భంలో వెబ్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి. కిటికీలపై ఎల్లప్పుడూ మెష్ ఉంచండి. వర్షపు రోజుల్లో తలుపులు తెరిచి ఉంచవద్దు.
Also Read : గోళ్లు కొరికే అలవాటు ఉంటే ఇలా దూరం చేసుకోండి..!