Home » మహేష్ బాబు, నరేష్ మధ్య గొడవలు వాస్తవమేనా ?

మహేష్ బాబు, నరేష్ మధ్య గొడవలు వాస్తవమేనా ?

by Anji
Ad

తెలుగు చలన చిత్ర రంగంలో కొత్త రకం సినిమాలను పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఎన్టీఆర్ తరువాత అంతటి మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ ఆంధ్రజేమ్స్ బాండ్ గా నిలిచారు. నవంబర్ 15 తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆయనను కడసారి చూసేందుకు తండోపతండాలుగా.. కుటుంబాలు కుటుంబాలే కదిలివస్తాయని ఎవరూ అంచనా వేయలేదు. అంతిమ యాత్రలో ఎంతో మంది పాల్గొని వారి అభిమానాన్ని చాటారు.

Advertisement

సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో అతని ఆస్తి నరేష్ కి చిల్లి గవ్వ కూడా దక్కలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నరేష్ కి, మహేష్ బాబు మధ్య గొడవలు తలెత్తుతున్నాయని రూమర్స్ వినిపిస్తున్నాయి.  కృష్ణ తన ఆస్తిని మనవళ్లు, మనవరాళ్ల పేరిట రాసినట్టు తెలుస్తోంది. అయితే  కృష్ణ గురించి ఆయన వ్యక్తి గతంగా ఎలాంటి వ్యక్తో ఈ కుటుంబం ఎలా ఉండేవారో ఆయనకు మేకప్ గా పని చేసిన మాధవరావు తెలిపారు. 

Advertisement

Manam News

మాధవరావు ప్రారంభం నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారికి మేకప్ మాన్ ఉండేవారు. దాదాపు శ్రీ శ్రీ సినిమా వరకు ఆయననే పని చేశారు. సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి, విజయ నిర్మల గురించి మాట్లాడుతూ.. వారిద్దరూ ఎన్నో దాన దర్మాలను చేశారంటూ చెప్పారు. విజయనిర్మల చనిపోయే ఏడాది ముందు తాను ఇల్లు కొనుక్కోవాలంటే 25 లక్షలు ఇచ్చారు. అప్పుగా తీసుకొని మళ్లీ ఇప్పిస్తానని చెప్పినా ఏమి వద్దు నువ్వు ఎంత సర్వీస్ చేసుంటావు మాకు అన్నారు. ఇందిరా దేవి అన్న అంటూ పిలిచే వారు అని చెప్పారు. విజయనిర్మలని పెళ్లి చేసుకున్న తరువాతనే  కృష్ణకి నలుగురు పిల్లలు పుట్టారు. అప్పుడు నరేష్ చాలా చిన్న పిల్లవాడు. వారందరూ కలిసి పెరిగారు. నరేష్ కి, మహేష్ కి మధ్య ఎప్పుడూ బేధాలు లేవని మాధవరావు తెలిపారు.

 Also Read :   నరేష్ పవిత్ర లోకేశ్ వ్యక్తి గత జీవితాల ఆధారంగా సినిమా.. దర్శకుడు ఎవరంటే.?

Visitors Are Also Reading