Home » ర‌హ‌స్యంగా రెహ‌మాన్ నిశ్చితార్థం.. వ‌రుడు ఎవ‌రంటే..?

ర‌హ‌స్యంగా రెహ‌మాన్ నిశ్చితార్థం.. వ‌రుడు ఎవ‌రంటే..?

by Anji
Ad

ఆస్కార్ అవార్డు గ్ర‌హిత‌, టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏ.ఆర్‌. రెహ‌మాన్ ఇంట్లో ర‌హ‌స్యంగా వేడుక నిర్వ‌హించారు. ఏ.ఆర్‌.రెహ‌మాన్ కుమార్తె ఖ‌తీజా రెహ‌మాన్ నిశ్చితార్థం జ‌రిగింది. ఈ విష‌యాన్ని ఖ‌తీజా స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. రియాస్దీన్ షేక్ మొహ‌మ్మ‌ద్‌తో నిశ్చితార్థం చేసుకున్న‌ట్టు వెల్ల‌డించింది. ఈ సంతోష‌క‌ర‌మైన వార్త‌ను సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించి.. త‌న‌కు కాబోయే భ‌ర్త‌ను కూడా ఈ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. రెహ‌మాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్ క‌థ‌నాల‌లో ఖ‌తీజా పోస్ట్‌ను పంచుకున్నారు.

Advertisement

2020లో బుఖా ఊపిరాడ‌కుండా వేసుకున్న కార‌ణంగా ఖ‌తీజా వివాదంలో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ వివాదంపై ఖ‌తీజా ప‌రిణితితో స్పందించారు. త‌న‌కు న‌చ్చిన‌వి వేసుకోవ‌డం త‌న ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఖ‌తీజా మ‌ళ్లీ ఎంగేజ్‌మెంట్ తో వార్త‌ల్లో నిలిచింది. రియాస్దీన్ షేక్ మొహ‌మ్మ‌ద్‌తో త‌న నిశ్చితార్థం జ‌రిగింద‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌క‌టించింది. ఖ‌తీజా పోస్ట్ ప్ర‌కారం.. రియాస్దీన్ ఓ పారిశ్రామిక వేత్త‌, ఆడియో ఇంజ‌నీర్ అని తెలుస్తోంది. యాదృశ్చికంగా ఖ‌తీజా త‌న పుట్టిన రోజునే రియాస్దీన్‌తో నిశ్చితార్థం చేసుకోవ‌డం విశేషం.

Advertisement

కాబోయే భ‌ర్త ఫొటోను ఖ‌తీజా షేర్ చేస్తూ.. స‌ర్వ‌శ‌క్తిమంతుడి ఆశీర్వాదంతో పారిశ్రామిక‌వేత్త, విజ్కిడ్ ఆడియో ఇంజినీర్ అయిన రియాస్దీన్ షేక్ మొహమ్మ‌ద్‌తో నా నిశ్చితార్థం గురించి మీకు తెలియ‌జేస్తున్నందుకు సంతోషంగా ఉంద‌ని ప్ర‌క‌టించింది. డిసెంబ‌ర్ 29న నా పుట్టిన‌రోజు స‌న్నిహిత కుటుంబ స‌భ్యులు, ప్రియ‌మైన వారి స‌మ‌క్షంలోనే నిశ్చితార్థం జ‌రిగిన‌ట్టు తెలిపింది. రెహ‌మాన్‌, సైరా భాను దంప‌తుల‌కు ముగ్గురు పిల్ల‌లు. అందులో ఖతీజా, ర‌హిమా, అమీన్‌. ఖ‌తీజా త‌మిళ సినిమాల‌లో కొన్ని పాట‌లు కూడా పాడారు. ర‌జినికాంత్ ఎంథిర‌న్‌లోని పుధియ మ‌నిధ పాట‌ను ఆమె తొలిసారిగా పాడింది. ఖ‌తీజా, రియాస్దీన్‌ల పెళ్లి తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు స‌మాచా

Visitors Are Also Reading