అటవీ రక్షణలో భాగంగా విధి నిర్వహణలో అసాంఘిక శక్తుల దాడుల్లో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మరణిస్తే వారికి తెలంగాణ ప్రభుత్వం భారీ పరిహారం ప్రకటించింది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఇండిగో 6 ఈ 897 విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. వారణాసి నుండి బెంగుళూరు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం వల్ల అత్యవసర ల్యాండింగ్ అయ్యింది.
Advertisement
నేడు నాటో కూటమిలోకి ఫిన్లాండ్ చేరనుంది. నాటోలోకి 31వ సభ్యదేశంగా ఫిన్లాండ్ చేరుతోంది.
తిరుమలలో 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70,086 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 28,832 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.4.17 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది.
Advertisement
ఐపీఎల్‌లో నేడు ఢిల్లీతో గుజరాత్ తలపడనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం ప్రారంభం కానుంది.
ఏప్రిల్ 5న సీఎం జగన్ కడపలో పర్యటించనున్నారు. ఒంటిమిట్ట కోదండరాముడిని జగన్ దర్శించుకోనున్నారు.
రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని కాంగ్రెస్ నేత భట్టీ విక్రమార్క అన్నారు. కాళేశ్వరం కట్టి చుక్క నీళ్ళు ఇవ్వలేదని..భూములు ముంచేశారని అన్నారు. ఓపెన్ కాస్ట్ లు మూసేస్తాం అన్నారని..రాష్ట్రం వచ్చాక పైనున్న మట్టితో పాటు బొగ్గును ఆంధ్రా బడాబాబులకు కట్టబెడుతున్నారని అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నేడు పవన్ అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.