ఈ రోజు సాయంత్రం 3 గంటలకు సూరత్ కోర్టులో రాహుల్ గాంధీ విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 1 గంటకు రాహుల్ మరియు ప్రియాంకగాంధీ సూరత్ బయల్దేరనున్నారు.
Advertisement
ఏపీ సీఎం జగన్ నేడు గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్షాసమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం సమీక్షసమావేశం జరుగుతోంది.
హైదరాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాద ఘటనపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గత నెల 16న జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు చనిపోవడంతో సుమోటగా స్వీకరించి, 12 మందిని ప్రతివాదులుగా హైకోర్టు చేర్చిన సంగతి తెలిసిందే.
నేడు పోలవరంపై సెంట్రల్ వాటర్ కమిషన్ సమావేశం నిర్వహిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ వల్ల ముంపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రాష్ట్రాలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ అధికారులు పాల్గొనబోతున్నారు.
Advertisement
నేటి నుండి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 2652 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తిరుమలలో 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 82,398 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,076 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన బీజేపీ కుట్రలను నిరసిస్తూ ఈనెల 8న మంచిర్యాల జిల్లా కేంద్రంలో సత్యాగ్రహ దీక్ష పేరిట లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నేత భట్టీ విక్రమార్క అన్నారు.
మంత్రివర్గంలో మార్పులు చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై అంబటిరాంబాబు స్పందించారు. మంత్రి వర్గంలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు.