వైఎస్ వివేకానందరెడ్డి హ* కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం 2.30 కు విచారణ జరగనుంది. హైదరాబాద్ నుండి ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందులకు బయలుదేరారు.
హైదరాబాద్ GHMC ఆధ్వర్యంలో మే 31వ తేదీ వరకు వివిధ క్రీడలలో శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. 353 ప్లే గ్రౌండ్ లలో 915 కోచింగ్ సెంటర్లలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ల నిర్వహణ జరుగుతోంది. 37 రోజుల పాటు నిర్వహించే సమ్మర్ క్యాంపులలో 44 రకాల క్రీడలలో శిక్షణ ఇవ్వనున్నారు.
Advertisement
దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో NIA సోదాలు జరుగుతున్నాయి. “పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా” (పీఎఫ్ఐ) కార్యకలాపాలపై చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్.ఐ.ఏ సోదాలు నిర్వహిస్తోంది.
ఆదిలాబాద్ జిల్లాలో రేపు రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నిరుద్యోగ సమర భేరికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
Advertisement
కరీంనగర్ పద్మనగర్ లోని ప్లాస్టిక్ కవర్ల పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అనంతపురం తాడిపత్రిలో మున్సిపాలిటీ అధికారుల వైఖరిని నిరసిస్తూ జెసిప్రభాకర్ రెడ్డి నిరసన కొనసాగిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జేసీ కాలకృత్యాలు పూర్తి చేశారు. మునిసిపాలిటీలో ఏం చేయాలన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
కేరళలో ఇవాళ తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించారు. తిరువనంతపురం నుంచి కాసరగోడ్ వరకూ రైలు సర్వీస్ ను నడపనున్నారు.
జేఈఈ మెయిన్స్ 2023 కు సంబంధించిన కీ విడుదలయ్యింది. వెబ్సైట్లో జేఈఈ మెయిన్ ఫైనల్ కీ అందుబాటులో ఉంది.
పోలీసులపై దాడి కేసులో వైఎస్ షర్మిలకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. మే 8 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ ను విధించింది.
అధికారంలోకి వస్తే జీఎస్టీ మారుస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ధనికుల కోసమే జీఎస్టీ తెచ్చారని 5 రకాలుగా ఉన్న ఈ పన్ను విధానం చాలా క్లిష్టమైందన్నారు. జీఎస్టీ ఎలా ఫైల్ చేయాలో తెలియక చిరువ్యాపారులు నష్టపోతున్నారని అన్నారు.