Home » April 22nd 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

April 22nd 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

వివేకా హ* కేసులో నాలుగో రోజు వైఎస్ భాస్కర్ రెడ్డి విచార‌ణ కొన‌సాగుతోంది. చంచల్‌గూడ జైలు నుండి ఇద్దరినీ సీబీఐ కార్యాలయానికి త‌రలించి విచార‌ణ జ‌రుపుతున్నారు. సాయంత్రం విచార‌ణ కొనసాగనుంది.

గురుకుల విద్యా సంస్థల్లో 1,276 పీజీటీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నెల 24 నుండి వచ్చే నెల 24 వరకు దరఖాస్తుల స్వీకరణ జ‌ర‌గ‌నుంది. 1,276 పోస్టులలో 966 పోస్టులు మహిళలకు రిజర్వు చేశారు. 310 పోస్టులు జనరల్ కోటా కింద రిజ‌ర్వ్ అయ్యాయి.

Advertisement

తిరుమలలో 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 57,354 మంది భక్తులు ద‌ర్శించుకున్నారు. 24,398 మంది భక్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు.

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణశాఖ హెచ్చ‌రించింది.

ఐపీఎల్‌లో నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు లక్నోతో గుజరాత్ ఢీ కొట్ట‌నుంది. రాత్రి 7.30 గంటలకు ముంబై- పంజాబ్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

మెదక్, సంగారెడ్డి జిల్లాల‌లో వర్షం దంచి కొడుతోంది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం మెదక్ జిల్లాలో నమోదయ్యింది. మెదక్ జిల్లా చిప్పలతుర్తిలో 3.5 సె. మీ వర్షపాతం నమోదయ్యింది.

టీఎస్పీఎస్సీ లో కొత్త పోస్టులకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నారు. పేపర్ లీకేజీ తో దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు.

Visitors Are Also Reading