Home » April 15th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

April 15th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

లిక్క‌ర్ స్కాం లో ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీచేసింది. ఎప్రిల్ 16న సీబీఐ కార్యాల‌యానికి రావాల‌ని పేర్కొంది.

విశాఖ ఉక్కుపోరాట కమిటీ మహాపాదయాత్ర ముగిసింది. స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం వరకు సుమారు 25 కిలోమీటర్లు పాదయాత్ర కొన‌సాగింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమై 11 గంటలకు పాద‌యాత్ర ముగిసింది.

Advertisement


తిరుమల టీటీడీ పేరుతో భక్తులను మోసగిస్తున్న 40 వెబ్‌సైట్లపై టీటీడీ ఐటీ జీఎం సందీప్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్శన టికెట్లు, వసతి గదుల కేటాయింపు, ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఫేక్ వెబ్ సైట్ నిర్వాహ‌కులు మోసాల‌కు పాల్ప‌డుతున్నారు.

Advertisement


ఇండియాలో క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముకం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 10,753 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

జూలై 1 నుండి అమ‌ర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది.ఈ నేప‌థ్యంలో ఎప్రిల్ 17 నుండి అన్ లైన్ ఆఫ్ లైన్ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది.

ఈరోజు వ‌రంగ‌ల్ లో బీజేపీ నిరుద్యోగ మార్చ్ నిర్వ‌హించ‌నున్నారు. హ‌న్మకొండ కేయూ చౌర‌స్తా నుండి అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ర‌కూ ర్యాలీ గా వెళ్ల‌నున్నారు.

మంచిర్యాల‌లో కాంగ్రెస్ స‌త్యాగ్ర‌హ దీక్ష ముగిసింది. ఈ దీక్ష‌కు భారీగా ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌ల్లికార్జున్ ఖార్గే మాట్లాడుతూ..తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సింగిల్ గా బ‌రిలోకి దిగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Visitors Are Also Reading