హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహా ప్రతిష్టాపణ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ పూర్తిగా మూసివేసివేశారు.
TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. చంచల్‌గూడ జైలులో ఉన్న లౌకిక్, సుస్మితను మూడు రోజుల సిట్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ రోజు ఉదయం 10 గంటల తర్వాత సిట్ కస్టడీలోకి తీసుకోనుంది.
Advertisement
నేడు 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ జరగనుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు వాహనాల దారి మళ్లించారు. నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, లక్డీకపూల్, తెలుగుతల్లి జంక్షన్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Advertisement
తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న 45 కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనే 18 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది.
నేడు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నారాయణపేట్, నాగర్ కర్నూల్ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఖమ్మం చీమలపాడు మృతుల కుటుంబాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్షించారు. వీడియో కాల్ చేసి బాధిత కుటుంబసభ్యులతో పవన్ మాట్లాడారు.
2024లోనూ సీఎం జగనే అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజల్లో నాయకులుగా ఉన్న వాళ్ళకే ఇప్పుడు సీట్లు ఇస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు బయటికి వచ్చేవాళ్ళని కానీ, ఇప్పుడు పరిస్థితి అలా కాదు, ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తిరిగిన వారే నాయకుడని అంబటి వ్యాఖ్యానించారు.