Home » దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మృతిపై.. డాక్ట‌ర్ మ‌నోహ‌ర్ కీల‌క విష‌యాలు వెల్ల‌డి..!

దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మృతిపై.. డాక్ట‌ర్ మ‌నోహ‌ర్ కీల‌క విష‌యాలు వెల్ల‌డి..!

by Anji
Ad

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతిపై విచారిస్తున్న ఏ.ఆర్‌. ముగ‌సామి క‌మిష‌న్ ముందు వాద‌న సంద‌ర్భంగా అపోలో ఆసుప‌త్రి వైద్యుడు బాబు మ‌నోహ‌ర్ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. ముఖ్యంగా 2016లో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసే స‌మ‌యంలో జ‌య‌ల‌లిత తీవ్ర అనారోగ్యంతో ఉన్నార‌ని.. ఆమెకు తీవ్ర‌మైన త‌ల‌నొప్పి వ‌చ్చేది అని చెప్పారు. శ‌శిక‌ళ త‌ర‌పు న్యాయ‌వాది రాజా షణ్ముగం ప్ర‌శ్నించ‌గా.. డాక్ట‌ర్ ఈ వాంగ్మూలం ఇచ్చారు. జ‌య‌ల‌లిత‌ను మ‌రింత విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు కోరిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. తాను రోజుకు 16 గంట‌లు ప‌ని చేస్తుండ‌టంతో క‌ష్టం అని జ‌య‌ల‌లిత బ‌దులు ఇచ్చారు.

Advertisement

Advertisement

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత డిసెంబ‌ర్ 05, 2016న గుండెపోటుతో మ‌ర‌ణించారు. అధికారంలో ఉండ‌గా మ‌ర‌ణించిన భార‌త‌దేశ మొద‌టి మ‌హిళా ముఖ్య‌మంత్రిగా ఆమె నిలిచారు. అన్నాడీఎంకే అధినేత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణానికి దారితీసిన కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేసేందుకు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం జ‌స్టిస్ ఏ.ఆర్‌.ముగ‌స్వామి నేతృత్వంలో క‌మిష‌న్‌ను నియ‌మించింది. ఆమె 75 రోజుల పాటు ఆసుప‌త్రిలో ఉన్నారు. ఆమె మ‌ర‌ణానికి సంబంధించిన కార‌ణాల‌పై చాలా ఊహ‌గానాలు వ‌చ్చాయి.

ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) వైద్యుల‌తో కూడిన ప్యానెల్‌ను నామినేట్ చేయాల‌ని.. విచార‌ణ‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తోన్న జ‌స్టిస్ ఏ.ఆర్‌.ముగ‌స్వామి క‌మిష‌న్‌కు సాయం చేయ‌డానికి మెడిక‌ల్ బోర్డును ఏర్పాటు చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బ‌హిష్క‌రించ‌బ‌డిన అన్నాడీఎంకే స‌భ్యుడు టీటీవీ దిన‌క‌ర‌న్ ఈ అంశంపై స్పందిస్తూ.. జ‌య‌ల‌లిత అనారోగ్యంతో ఉన్నార‌ని.. ఆ త‌రువాత త‌న అత్త శ‌శిక‌ళ‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఆమె మ‌ర‌ణాన్ని రాజ‌కీయం చేశార‌ని విమ‌ర్శించారు.

Also Read :  సీనియ‌ర్ ఎన్టీఆర్ పిసినారితనం గురించి మీకు తెలుసా..?

Visitors Are Also Reading