సింగర్ మంగ్లీ.. ఫోక్ సాంగ్ లకు పెట్టింది పేరు.. ఆమె పాట అందుకుంది అంటే మూలలున్న ముసలి తాత సైతం ఎగిరి గంతు వేయాల్సిందే. తను పాట అందుకుంది అంటే కుర్ర కారు స్టెప్పులు వేయాల్సిందే.. అలాంటి సింగర్ మంగ్లీ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టాలు పడింది.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం స్టార్ హోదాను సంపాదించుకుంది. సినిమా పాటలు కూడా పాడుతూ తన పాటల కెరియర్లో దూసుకుపోతోంది. అలాంటి మంగ్లీ టాలెంటును గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.. ప్రభుత్వం ఏమిచ్చిందో ఇప్పుడు చూద్దాం..
Advertisement
also read:మెగాస్టార్ బాస్ పార్టీ సాంగ్ ని ముందే చూసేసిన పవర్ స్టార్..!
మంగ్లీ పొలిటికల్ పాటలే కాకుండా, భక్తి పాటలు పాడుతూ కూడా జనాలకు మరింత దగ్గరయింది. ఈమె పాడిన పాటలు ఏవైనా సరే సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం స్టార్ సింగర్లతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకుంటూ ఇండస్ట్రీలో రికార్డులను క్రియేట్ చేస్తోంది. తాజాగా సింగర్ మంగ్లీ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగ్లీకి టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా నియమించినట్టు ఉత్తర్వులు జారీ చేశారు. గత నాలుగు రోజుల క్రితమే మంగ్లీ ఈ ఛానల్ కు సలహాదారులుగా బాధ్యతలు కూడా స్వీకరించారట. ఈ పదవిలో ఆమె రెండేళ్ల పాటు కొనసాగనుంది.
Advertisement
ఇది మంగ్లీకి అరుదైన గౌరవమే కానీ ఆమె అభిమానులను కాస్త నిరశపరిచిందని చెప్పవచ్చు.. ఆమె ఫోక్ సాంగ్ లను ఇష్టపడే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి మంగ్లీ ఈ పదవి రావడం వల్ల అనేక త్యాగాలు చేసిందని సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. కొందరు మంగ్లీ తన గొంతును అమ్మేసుకుందని, ఇకనుంచి ఫోక్ సాంగ్ లకు దూరం కానుందని, ఆమెను రాజకీయంగా వాడుకోవడానికే ఈ పదవి ఇచ్చారంటూ కొంతమంది చర్చించు కుంటున్నారు. ఏది ఏమైనా ఇన్ని తెలివితేటలు ఉన్న మంగ్లీ వాళ్ళ మాయలో పడిపోయింది అంటూ జనాలు మండిపడుతున్నారు. మరి పదవిలో ఉండగా మంగ్లీ రానున్న రోజుల్లో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో లేదంటే సైలెంట్ గా ఉంటుందో ముందు ముందు తెలుస్తుంది.
also read: