Home » Virat Kohli : వికెట్ తీసిన విరాట్‌ కోహ్లి..అనుష్క రియాక్షన్ వైరల్

Virat Kohli : వికెట్ తీసిన విరాట్‌ కోహ్లి..అనుష్క రియాక్షన్ వైరల్

by Bunty
Ad

Virat Kohli : టీమిండియా బ్యాటర్‌ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా విరాట్ కోహ్లీ అంటేనే బ్యాటింగ్. రికార్డులు బద్దలు కొట్టడానికి పుట్టాడా అన్నట్లు తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సృష్టించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఆల్ టైం గ్రేట్ గా ఎదిగాడు కోహ్లీ అంటే కేవలం బ్యాటింగ్ ఏనా అంటే బౌలింగ్ లోను తనకంటూ కొన్ని ప్రత్యేకమైన రికార్డులు ఉన్నాయని చెప్పవచ్చును. బ్యాటింగ్‌ లోనే కాకుండా బౌలింగ్‌ లో రాణిస్తాడు విరాట్ కోహ్లీ.

Anushka Sharma’s heartwarming reaction to Virat Kohli taking a wicket in IND vs NED clash

ఎప్పుడో ఓ సారి అరుదుగా బౌలింగ్ చేసే విరాట్ కోహ్లీ బౌలింగ్ రికార్డ్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. విరాట్ కోహ్లీ బౌలింగ్ ది ఓ యునిక్ స్టైల్ చూడడానికి రామ్ ఫుడ్ బౌలింగ్ లాగానే ఉంటుంది. కానీ ప్రాపర్ గా మేనేజ్ చేస్తాడు. తన బౌలింగ్ తో అవసరమైన సందర్భాల్లో వికెట్లు కూడా తీశాడు కోహ్లీ. ఇక నిన్న నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో ఆ జట్టు కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్ ను అవుట్ చేశాడు. ధోనీ కెప్టెన్సీలో 2011లో ఇంగ్లాండ్ తో జరిగిన టి20 మ్యాచ్ లో కోహ్లీ తొలిసారి బౌలింగ్ చేశాడు.

Advertisement

ఇక ఇప్పుడు మరోసారి బౌలింగ్‌ చేశాడు కోహ్లీ. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో నెదర్లాండ్ జట్టుతో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఒక వికెట్ పడగొట్టాడు విరాట్‌ కోహ్లీ. 17 పరుగులు చేసిన నెదర్లాండ్ కెప్టెన్ ఎడ్వార్డ్స్ ను పెవిలియన్ కు పంపించాడు విరాట్ కోహ్లీ. అయితే స్టేడియంలో మ్యాచ్ ను చూస్తున్న విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ… ఆనందంతో కేరింతలు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో మొత్తం తొమ్మిది వికెట్లు పడగొట్టాడు విరాట్ కోహ్లి.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading